మార్నింగ్‌ మూడు గంటలకు ఎవరైనా ఇలా ఉంటారా?.. మహేష్‌ న్యూ లుక్‌ గుర్తుపట్టలేం!

Published : Nov 17, 2020, 10:12 AM IST
మార్నింగ్‌ మూడు గంటలకు ఎవరైనా ఇలా ఉంటారా?.. మహేష్‌ న్యూ లుక్‌ గుర్తుపట్టలేం!

సారాంశం

మరో కొత్త ఫోటోని పంచుకున్నారు నమ్రత. నిజంగానే మహేష్‌ ఇందులో కొత్తగా ఉన్నారు. ఎప్పుడూ లైట్‌ షేవింగ్‌తో కలిపించే మహేష్‌.. ఇప్పుడు పూర్తి షేవ్‌తో కనిపించారు. మీసాలు పూర్తిగా తీసేశారు. టీషర్ట్, కూల్‌ స్పెడ్స్ తో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.

మహేష్‌బాబు ఇటీవల హాలీడేస్‌కి వెళ్లారు. తన ఫ్యామిలీతో కలిసి అమెరికాలో ఎంజాయ్‌ చేస్తున్నారు. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్‌, ముద్దుల తనయ సితారతో కలిసి మహేష్‌ వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఆయన బయటకు వెళ్లారు. ఇక ఎయిర్‌పోర్ట్ లో బయలు దేరినప్పటి నుంచి.. ప్రతి రోజు తన టూర్‌కి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ తన అభిమానులను అలరిస్తున్నారు. 

తాజాగా  మహేష్‌ మరింత కొత్తగా కనిపిస్తున్నారు. అభిమానులను అలరిస్తున్నారు. ఈ ఫోటోని నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. మార్నింగ్‌ మూడు గంటలకు విమానం కోసం వెయిట్‌ చేస్తున్నబ్రహ్మాండమైన వ్యక్తి అని తెలిపింది నమ్రత. ఈ సమయంతో ఎవరైనా ఇలా కనిపిస్తారా? అన్నట్టుగా పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. అయితే మరి ఏ ఎయిర్‌పోర్ట్ అనేది క్లారిటీ లేదు. మరి అప్పుడే హాలీడేస్‌ని ముగించుకుని వస్తున్నాడా? లేక మరో ప్రాంతానికి వెళ్తున్నారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. 

ఇదిలా ఉంటే మహేష్‌ ప్రస్తుతం `సర్కారు వారి పాట` చిత్రంలో నటించనున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమా ఈ నెలాఖరులోగానీ, డిసెంబర్‌ మొదటి వారంలోగానీ ప్రారంభం కానుందని తెలుస్తుంది. దీనికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద