మనం గమనిస్తే డిఫరెంట్ టైటిల్స్ ఉన్న సినిమాలు రిలీజ్ కు ముందే క్రేజ్ తెచ్చుకుంటూ ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా నాని సినిమాలకి ఆ విభిన్న టైటిల్స్ పెట్టడం మొదటనుంచీ గమనించవచ్చు. భలే భలే మగాడివోయ్, గ్యాంగ్ లీడర్, అష్టా చమ్మా, వి, శామ్ సింగ్ రాయ్ ఇలా వరసగా ఇంట్రస్టింగ్ టైటిల్స్ తో ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించేందుకు ప్రయత్నం చేయటం గమనించవచ్చు.
టైటిల్ అనేది సినిమాకి క్రేజ్ తెచ్చే అంశాలలో ఒకటి. అందుకే దర్శక,నిర్మాతలు టైటిల్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుని ఫైనలైజ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్న సినిమాలకి టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం గమనిస్తే డిఫరెంట్ టైటిల్స్ ఉన్న సినిమాలు రిలీజ్ కు ముందే క్రేజ్ తెచ్చుకుంటూ ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా నాని సినిమాలకి ఆ విభిన్న టైటిల్స్ పెట్టడం మొదటనుంచీ గమనించవచ్చు. భలే భలే మగాడివోయ్, గ్యాంగ్ లీడర్, అష్టా చమ్మా, వి, శామ్ సింగ్ రాయ్ ఇలా వరసగా ఇంట్రస్టింగ్ టైటిల్స్ తో ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించేందుకు ప్రయత్నం చేయటం గమనించవచ్చు.
అదే కోవలో నాని మరోసారి తన కొత్త సినిమాకి సరికొత్త టైటిల్ ని ఫైనలైజ్ చేశారని తెలుస్తోంది. ఆ టైటిల్ వింటే మీరు కూడా భలే పెట్టారు ఈ టైటిల్ అనకుండా ఉండలేరు. ఆ టైటిల్ మరేదో కాదు 'అంతే సుందరానికి'. అసలు ఊహించగలరా ఇలాంటి టైటిల్ నాని వంటి పెడతారని. అందుకే కదా టైటిల్ అనౌన్స్ అవకుండానే వార్తల్లో నిలుస్తోంది. అలాగే ఈ సినిమా కొద్దిగా అడల్డ్ కామెడీ కూడా మిక్స్ చేసి ఉండబోతోందని తెలుస్తోంది. ఇందులో హీరోకి విషయం లేదని జనం అనుకుంంటారట..అలాంటి హీరో వల్లే తనకు ఏదో అయిపోయిదనే హీరోయిన్ గోల చేస్తుందిట. టోటల్ గా అడల్డ్ టచ్ కామెడీ తో మన ముందుకు వస్తున్నాడన్నమాట.
ప్రాజెక్టు వివరాల్లోకి వెళితే...నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో ఓ సినిమా వస్తుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో తన సత్తా చాటిన వివేక్ ఆత్రేయ తన నెక్స్ట్ సినిమాను నానితో ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ తో పాటుగా సినిమాలో హీరోయిన్ గా నజ్రియా నటిస్తుందని ఇప్పటికే ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం నాని శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీష్, రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో శ్యాం సింగ రాయ్ సినిమా చేస్తున్నాడు. టక్ జగదీష్ పూర్తి కాగానే వివేజ్ ఆత్రేయ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.