NTR Comments on Rajamouli : ఎన్టీఆర్ ను ఇరిటేట్ చేసిన రాజమౌళి.. ఇంటర్వ్యూలో ఎలా రగిలిపోయాడో చూడండి..

Published : Mar 16, 2022, 04:03 PM IST
NTR Comments on Rajamouli : ఎన్టీఆర్ ను ఇరిటేట్ చేసిన రాజమౌళి.. ఇంటర్వ్యూలో ఎలా రగిలిపోయాడో చూడండి..

సారాంశం

దర్శకధీరుడు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో రాజమౌళి తనను ఎలా ఇరిటేట్ చేశాడో చెప్పాడు.

రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram Charan) కలిసి నటించిన చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie). ఈ భారీ మల్టీస్టారర్‌ మూవీ మార్చి 25న విడుదల కానుంది. ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. సంక్రాంతికి సినిమా విడుదల కాబోందని అన్ని భాషల్లోనూ ప్రమోషన్‌ కార్యక్రమాలు చేశారు. కానీ ఊహించని విధంగా సినిమా వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. 

ఈ సందర్భంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఎన్టీఆర్ రాజమౌళి తెప్పించిన ఇరిటేషన్ ను గుర్తుచేసుకుంటూ రగిలిపోయాడు. డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఆర్ఆర్ఆర్ (RRR) టీంను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా సినిమా కు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తూ.. షూటింగ్ సమయంలో ఎప్పుడైనా మీకు ఇబ్బంది కలిగిందా అని అడిగాడు. ఇందుకు ఎన్టీఆర్ ఒక్కసారిగా ఎన్టీఆర్ కట్టలు తెచ్చుకున్న కోపంతో రాజమౌళి ఎలా చిరాకు తెప్పించేవాడో తెలిపాడు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. షూటింగ్ సందర్భంలో కాదు కానీ.. నార్మల్ టైమ్ లో జక్కన్న కాస్తా ఆ సాంగ్ చూపిస్తావా? అని అడిగితే చాలు చాలా ఎటకారంగా చూసేవాడని, కాస్తా తర్వగా చూపిస్తావా? అంటే మరీ చిరాకు తెప్పించేలా చూసేవాడని చెప్పుకొచ్చాడు. అయితే రాజమౌళి ముఖ కదలికలను కూడా యాక్ట్ చేసి చూపించాడు. దీంతో ఈ విషయం విన్న రాజమౌళి అవునా.. అంటూ నవ్వేశాడు. అటు అనిల్ రావుపూడి, రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ చెప్పే విధానానికి కడుపుబ్బా నవ్వారు. 

 

ఇక సినిమా విషయానికొస్తే మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇండియా తోపాటు ఇతర దేశాల్లోనూ ఎన్టీఆర్, జక్కన్నకు ఫ్యాన్స్ ఉండటంతో ఆర్ఆర్ఆర్ మూవీపై మరీ అంచనాలు ఉన్నాయి. ఆ రేంజ్ లోనే ప్రస్తుతం ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తుండటం సినిమాపై మరింత హైప్ ను పెంచుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) కూడా నటించింది. ఈ  చిత్రం నుంచి ఇటీవల సెకండ్ సింగిల్ ‘ఎత్తర జెండా’ వీడియో సాంగ్ రిలీజ్ చేయగా.. య్యూటూబ్ లో దూసుకుపోతోంది.

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?