ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్ మొన్న శుక్రవారం రిలీజైంది. ఈ సినిమాకు మార్నింగ్ షోకే డివైడ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా పూర్తి డ్రాప్ కనపడుతోందని టాక్. ఈ నేపధ్యంలో ప్రబాస్ రియాక్షన్ ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. ఈ మూవీతో డార్లింగ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. డార్లింగ్‌తో సినిమా చేసేందుకు బాలీవుడ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నారు. మరోవైపు.. కేజీఎఫ్ వంటి సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్ మొన్న శుక్రవారం రిలీజైంది. ఈ సినిమాకు మార్నింగ్ షోకే డివైడ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా పూర్తి డ్రాప్ కనపడుతోందని టాక్. ఈ నేపధ్యంలో ప్రబాస్ రియాక్షన్ ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రభాస్ మీడియాకు అందుబాటులో లేరు. కానీ ఈ రిజల్ట్ ని ప్రభాస్ సీరియస్ గా తీసుకున్నట్లు అంతర్గత వర్గాల సమాచారం. ఆయన యువి క్రియేషన్స్ వారి ప్రొడక్షన్ మోడల్ పై తృప్తికరంగా లేరని చెప్తున్నారు. ఈ సినిమాపై 300 కోట్లు దాకా ఖర్చు పెట్టడం ఎక్కువనే ప్రభాస్ భావిస్తున్నారట. అందుకే ఇది ప్రాఫిట్ వెంచర్ కాలేదని అన్నారట. యాక్షన్ సినిమాలపై పెట్టాల్సిన ఖర్చుని ఇలాంటి లవ్ స్టోరీలపై పెట్టారని అందుకే భాక్సాఫీస్ వద్ద ఇబ్బంది పడుతోందని కంక్లూజన్ కు వచ్చారట. మోడరేట్ బడ్జెట్ లో కనుక ఈ సినిమాని చేసి ఉంటే ఖచ్చితంగా ప్రాఫెట్ తో కూడిన వెంచర్ అయ్యిండేదని అన్నారట. అయితే ఇప్పటికే అంతా లేటైపోయింది. యువి క్రియేషన్స్ కు ఈ లాస్ ని పూడ్చటానికి మరో ప్రాజెక్టు చేస్తానని మాట ఇచ్చారట.
పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ హస్తసాముద్రికుడిగా కనిపించారు. విధి కి ప్రేమకు మధ్య జరిగే పోరు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు మూడేళ్ళుగా ప్రభాస్ సినిమాకోసం ఎదురుచూసిన అభిమానులు రాధేశ్యామ్ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా మంది మాత్రం ఈ సినిమా పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో కూడా డబ్ చేసి విడుదలైన ఈ సినిమా హిందీ వెర్షన్ మాత్రం అంతంత మాత్రంగానే వసూలు చేసింది. హిందీ వెర్షన్ కేవలం రూ 14 కోట్లను మాత్రమే సాధించింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదలైంది. ఈ సినిమా హిందీ వెర్షన్‌కు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇవ్వగా.. తెలుగు వెర్షన్‌కు ఎస్ఎస్ రాజమౌళి గొంతు సవరించారు.