ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి దేశ పౌరులను బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి దేశ పౌరులను బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. ఒక విషయంలో రాజమౌళి నెటిజన్లను, ప్రజలని హెచ్చరించారు., భారత సైన్యం కదలికలకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు తీయవద్దని, వాటిని షేర్ చేయొద్దని కోరారు.
రాజమౌళి ఇలా చెప్పడానికి కారణం ఉంది. ఆయన ట్విట్టర్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు. "మీరు భారత ఆర్మీ కదలికలను చూస్తే ఫోటోలు, వీడియోలు తీయవద్దు. వాటిని షేర్ చేయొద్దు. దీని వల్ల మీరు తెలియకుండానే శత్రువుకు సహాయం చేసే అవకాశం ఉంది. అసత్య సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొద్దు, ఇలా చేయడం వల్ల గోల తప్ప ఉపయోగం లేదు. శత్రువు కోరుకునేది అదే. అప్రమత్తంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. విజయం మనదే." అని రాజమౌళి ప్రజలకు సందేశం పంపారు.
ఈ సందేశం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ప్రజలందరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిస్తున్నారు.
ఇలాంటి కీలక సమయంలో, రాజమౌళి సూచన ప్రజలు డిజిటల్ బాధ్యతపై దృష్టిపెట్టేలా చేస్తోంది. దేశ భద్రత కేవలం సైనికులపైనే కాదు, ప్రతి పౌరుడు తమ పాత్రను నిబద్ధతతో నిర్వర్తించాల్సిన అవసరం ఉందని రాజమౌళి గుర్తు చేసినట్లు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఇంటర్నెట్, సోషల్ మీడియా యుగంలో, అపరిశీలితంగా సమాచారాన్ని పంచడం వల్ల ఊహించని ప్రమాదాలు ఏర్పడవచ్చు. అందుకే, అధికారిక సమాచారం మాత్రమే నమ్ముతూ, అప్రమత్తంగా ఉండాలి. ఇకపై భారత ఆర్మీ కదలికలపై ఫోటోలు లేదా వీడియోలు తీసేందుకు దూరంగా ఉండాలని, అవి శత్రువుకి లబ్ధి కలిగించే అవకాశాన్ని తగ్గించాలన్నదే రాజమౌళి విజ్ఞప్తి.