రాజకీయ నాయకులపై రాజమౌళి కామెంట్స్!

By Prashanth MFirst Published Feb 23, 2019, 5:53 PM IST
Highlights

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి మరోసారి తన మాటలతో జనాలను ఆకర్షిస్తున్నాడు. పైకి అంతగా చూపించరు గాని ఆయనకి కూడా మనసులో సామాజిక అంశాల పట్ల బాధ్యత ఎక్కువగానే ఉంటుందని చూపించారు. రీసెంట్ గా మీడియాతో చిట్ చాట్ చేసిన జక్కన్న RRR విషయాలతో పాటు పాలిటిక్స్ పై కూడా తనదైన శైలిలో స్పందించారు. 

రాజమౌళి మాట్లాడుతూ.. మొదట రాజకీయ నాయకులపై నాకు తప్పుడు అభిప్రాయం ఉండేది. నాయకులు ఎందుకు మంచిగా ఉండరని అనుకునేవాడిని. అయితే ఆ తరువాత నేతలందరూ చెడ్డవారు కాదని తెలుసుకున్నా. లోక్ సత్తా అథినేత జయప్రకాష్ నారాయణతో కలిసి తిరిగినప్పుడు ఒక ఐడియా వచ్చింది. పొలిటీషియన్స్ అందరూ చెడ్డవారు కాదు. 

ప్రస్తుత పరిస్థితులను బట్టి పొలిటీషియన్స్ ఎంత బాద్యులో అలాగే జనాలు కూడా అంతే బాధ్యతగా ఉండాలి. డబ్బు తీసుకొని ఓటేసినప్పుడు బ్లేమ్ చేయడానికి ఏమి ఉండదని తనదైన శైలిలో వివరణ ఇస్తూ.. RRR విషయంపై ఇప్పుడే స్పందించడం రైట్ టైమ్ కాదని అన్నారు. గతంలో ఈగ మర్యాద రామన్న సినిమాల కథలను ముందే చెప్పినట్లు ఇలాంటి సినిమాల గురించే ముందే చెప్పకూడదని వివరణ ఇచ్చారు. 

click me!