రాజమౌళి మామూలోడు కాదు.. దుబాయ్‌ నుంచి డైరెక్ట్ గా పోలింగ్‌కి.. ఫోటో వైరల్‌

Published : May 13, 2024, 10:55 AM IST
రాజమౌళి మామూలోడు కాదు.. దుబాయ్‌ నుంచి డైరెక్ట్ గా పోలింగ్‌కి.. ఫోటో వైరల్‌

సారాంశం

దర్శక ధీరుడు రాజమౌళి ఓటర్లని ఇన్‌ స్పైర్‌ చేస్తున్నాడు. ఆయన ఓటు వేసేందుకు ఏకంగా దుబాయ్‌ నుంచి రావడం విశేషం. ఆయన పోస్ట్ వైరల్‌ అవుతుంది.   

దర్శకధీరుడు రాజమౌళి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఓటర్లకి ఆయన ఆదర్శంగా నిలవడం విశేషం. ఓటు వేసేందుకు ఆయన విదేశాల నుంచి రావడం విశేషం. ఫ్యామిలీతో ఇటీవల దుబాయ్‌ వెళ్లిన రాజమౌళి.. ఓటు వేసేందుకు డైరెక్ట్ గా పోలింగ్‌కి వచ్చేశాడు. తన భార్య రమా రాజమౌళి, రాజమౌళి ఇద్దరు దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్ లో దిగి డైరెక్ట్ గా విమానాశ్రయం ఉనంచి పోలింగ్‌ బూత్‌కి వచ్చేశాడు. ఇద్దరు హైదరాబాద్‌లో ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 

ఈ సందర్భంగా దిగిన ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు రాజమౌళి. ఓటు వేయడానికి దుబాయ్‌ నుంచి వచ్చినట్టు ఆయన తెలిపారు. విమానాశ్రయం నుంచి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి వేశామని రాజమౌళి ట్వీట్‌ చేశారు. అలసిపోయిన లుక్‌లో ఓటు వేసినట్టు పేర్కొన్నారు జక్కన్న. రాజమౌళి చేసిన పని ఎంతో మందిని ఇన్‌స్పైర్‌ చేస్తుందని చెప్పొచ్చు. సిరాతో ఆయన దిగిన ఫోటో వైరల్‌ అవుతుంది. 

రాజమౌళి ప్రస్తుతం మహేష్‌ బాబుతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. `SSMB29` పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది. హాలీవుడ్‌ రేంజ్‌లో దీన్ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. గ్లోబల్‌ మార్కెట్‌కి రీచ్‌ అయ్యేలా, ఇండియన్‌ ఆడియెన్స్ లోనూ కొత్త ఆడియెన్స్ ని థియేటర్ కి తీసుకు వచ్చేలా ఈమూవీని రూపొందిస్తున్నారట. ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో సాహసికుడి యాత్ర ప్రధానంగా యాక్షన్‌ అడ్వెంచరస్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు రాజమళి. ఇందులో ఇతర దేశాల నటీనటులు కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. 

ఈ మూవీ కోసమే ఆయన లొకేషన్‌ అన్వేషణ చేస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే దుబాయ్‌ వెళ్లారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం రెడీ అవుతున్నారు మహేష్‌ బాబు. వర్కౌట్స్ చేస్తున్నారు. శరీర ఆకృతిని మార్చేస్తున్నారు. ఫిట్‌గా మారుతున్నారు. సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారని సమాచారం.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్