సొంత తండ్రి చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ రాజ్‌తరుణ్‌ హీరోయిన్ ఆరోపణలు.. పోస్ట్ వైరల్‌

Published : Jul 05, 2023, 04:26 PM IST
సొంత తండ్రి చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ రాజ్‌తరుణ్‌ హీరోయిన్ ఆరోపణలు.. పోస్ట్ వైరల్‌

సారాంశం

సొంత తండ్రిపైనే ఆమె ఆరోపణలు చేశారు హీరోయిన్ అర్థనా బిను. మలయాళ నటుడు, తన బయోలాజికల్‌ ఫాదర్‌ విజయ్‌ కుమార్‌.. తమని చంపేస్తామని బెదిరిస్తున్నట్టు నటి అర్థనా బిను ఆరోపించారు.  

తెలుగులో రాజ్‌తరుణ్‌తో `సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ అర్థనా బిను. ఏడేళ్లక్రితం(2016)లో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆదరణ పొందలేదు. కానీ ఈ అమ్మడు మాత్రం బాగానే రిజిస్టర్‌ అయ్యింది. కానీ తెలుగులో ఆఫర్లు రాలేదు. తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తన సొంత తండ్రిపైనే ఆమె ఆరోపణలు చేశారు. 

మలయాళ నటుడు, తన బయోలాజికల్‌ ఫాదర్‌ విజయ్‌ కుమార్‌.. తమని చంపేస్తామని బెదిరిస్తున్నట్టు నటి అర్థనా బిను ఆరోపించారు. తమ పేరెంట్స్ ఐదేళ్ల క్రితమే విడిపోయారని, ఇప్పుడు అమ్మ, చెల్లి, తాను అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నామని, ఇంట్లోకి అక్రమంగా చొరబడి బెదిరింపులకు పాల్పడుతున్నాడని, తనని యాక్టింగ్‌ ఆపేయాలని బెదిరిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఈ మేరకు అర్థనా బిను తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సుధీర్ఘ పోస్ట్ పెట్టారు. దీనిపై పోలీస్‌లకు ఫిర్యాదు చేసినా, వారి నుంచి స్పందన లేదని, దీంతో ఇలా పోస్ట్ పెట్టాల్సి వస్తుందన్నారు. 

ఇందులో అర్థనా బిను ఉండే ఇంట్లోకి గోడ దూకి వచ్చి, వారిని బెదిరించిన అనంతరం వెళ్లిపోతున్న తండ్రి దృష్యాలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఈ రాజ్‌ తరుణ్‌ హీరోయిన్‌ చెబుతూ, ఫాదర్‌తో తన తల్లి విడాకులు తీసుకుని ఐదేళ్లు అయినా, తరచూ వస్తూ గందరగోళం సృష్టిస్తున్నాడని, బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలిపింది. అతనిపై చాలా సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి యాక్షన్‌ తీసుకోవడం లేదని తెలిపింది. 

`ఈ రోజు అక్రమంగా మా కాంపౌండ్‌లోకి వచ్చి, డోర్‌ లాక్ వేసి ఉండటంతో కిటీకీ నుంచి బెదిరింపులకు దిగాడు. నా చెల్లెలుతోపాటు అమ్మ, అమ్మమ్మని చంపేస్తానని వార్నింగ్‌ ఇస్తున్నాడు. అంతేకాదు తాను సినిమాల్లో నటించడం ఆపేయాలని, లేదంటే తాను చెప్పిన సినిమాల్లోనే నటించాలని కండీషన్స్ పెడుతున్నాడని, మరోవైపు తాను నటించే సినిమాల్లో సహనటుల వద్ద తప్పుగా మాట్లాడుతున్నాడు. సినిమా ఆఫీసులకు వెళ్లి రచ్చ చేస్తున్నాడు. అమ్మ పనిచేసే ప్రదేశంలో, అలాగే చెల్లి కాలేజీల్లోనూ గందరగోళం సృష్టించినందుకు గానూ కేసు పెట్టగా, అది కోర్ట్ లో నడుస్తుంది. ఓ వైపు ఆయనపై కోర్ట్ లో కేసు నడుస్తుండగా, ఇప్పుడు ఇంటికి వచ్చి వార్నింగ్‌ ఇస్తున్నాడు. 

నన్ను మా అమ్మమ్మ.. డబ్బు కోసం సినిమాల పేరుతో అమ్ముకుంటుందని ఆరోపిస్తున్నాడు. కానీ సినిమాలు పూర్తిగా నా ఇష్టపూర్వకంగానే చేస్తున్నాను. సినిమాల్లో నటించడం నా అభిరుచి, నాకు ఆరోగ్యం సహకరించినంత కాలం నటిస్తూనే ఉంటాను. సినిమాల్లో నటించడం ఆపేయాలని కేసు పెట్టాడు, `షైలాక్‌`లో నటించినప్పుడు కూడా లీగల్‌గా కేసు పెట్టాడు, ఆ సినిమా ఆగిపోకుండా ఉండేందుకు నేను నా సొంత ఇష్టానుసారంగానే నటిస్తున్నానని అధికారిక చట్టపరమైన పత్రాలపై సంతకం చేయాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అంటూ తన ఆవేదన వ్యక్తం  చేసింది హీరోయిన్‌ అర్థనా బిను. 

చూడ్డానికి ఒకప్పటి నటి కళ్యాణిని పోలి ఉంటే అర్థనా బిను.. మలయాళంలో `ముదుగావ్‌`, తమిళంలో `తొండన్‌`, `సెమ్మా`, `కడైకుట్టీ సింగం`, `వెన్నిలా కబడ్డి కుజు 2`తోపాటు `షేలాక్‌` చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకటి రెండు ప్రాజెక్ట్ లు ఉన్నట్టు తెలుస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్