
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ తాజా చిత్రం స్పై (SPY). ఆజాద్ హింద్ ఫౌజ్ సృష్టికర్త సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాద మిస్టరీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీని పాపులర్ ఎడిటర్ గ్యారీ బీహెచ్ డైరెక్ట్ (డెబ్యూ) చేశాడు. ఐశ్వర్యా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రం జులై 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ డివైడ్ టాక్ తెచ్చుకుంది.అయితే స్పై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.11.70 కోట్లు గ్రాస్ రాబట్టి.. నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ నేపధ్యంలో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా ఓ లేఖను విడుదల చేసారు.
ఈ లేఖలో ఏముందంటే.. స్పై మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు. ప్యాన్ ఇండియన్ స్థాయిలో విడుదల చేయాలని ప్రయత్నించినా.. కంటెంట్ డిలే వల్ల రిలీజ్ చేయలేకపోయాం అని చెప్పాడు. ఓవర్శీస్ లో 350 షోస్ క్యాన్సిల్ అవడానికి కారణం కూడా అదే అన్నాడు. ఈ సందర్భంగా తమిళ్, కన్నడ, మళయాల ప్రేక్షకులకు సారీ చెప్పాడు. కార్తికేయ2 తర్వాత వచ్చే మూడు సినిమాలను ప్రాపర్ గా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తాను అని తెలియజేశాడు.
ఇక తెలుగు ప్రేక్షకులకూ ఓ ప్రామిసింగ్ చేస్తున్నానంటూ... ఇకపై ఎంత ప్రెజర్ ఉన్నా.. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కానని.. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ఓ మంచి క్వాలిటీ అవుట్ పుట్ తో వస్తాను అన్నాడు.
ఇంతకీ మొత్తంగా నిఖిల్ ఈ లెటర్ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు. స్పై వర్కవుట్ కాలేదని అర్దమై ఈ లెటర్ రాసారా..లేక సినిమా పోయిందని చెప్పలేక ఇంకేదో కవర్ చేస్తున్నట్టుగా ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అలాగ మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ లేట్ అయింది లేదా క్యాన్సిల్ అయింది అన్న విషయం ఇన్ని రోజుల వరకూ నిఖిల్ కు తెలియకుండా పోయిందా.? అసలు ఇవేమీ కాకుండా ఏదో చెప్పాలని ఇంకేదో చెప్పినట్టుగా ఉంది అంటున్నారు. ఈ లెటర్ లో అసలు అతను ఏం చెప్దామనకున్నారనే విషయం ప్రాపర్ గా మెన్షన్ చేయలేకపోయాడు అనిపిస్తోంది. అయినా నిఖిల్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఓ రేంజ్ క్యూరియాసిటీతో చూసేంత సీన్ ఉందా..? ఆ మొత్తం ఆడియన్స్ కు ఇలా సారీ చెప్పడానికి..? అని కడిగేస్తున్నారు.
స్పై నేతాజీ మరణం మిస్టరీని ఛేదించే క్రమంలో సాగే యాక్షన్ సన్నివేశాలతో సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగుతూ మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. నిఖిల్ ఖాతాలో ది ఇండియా హౌజ్, స్వయంభు, కార్తికేయ 3 సినిమాలున్నాయి.