పెళ్లికి సిద్దమవుతున్న రాజ్ తరుణ్

Published : May 29, 2019, 08:17 AM ISTUpdated : May 29, 2019, 08:20 AM IST
పెళ్లికి సిద్దమవుతున్న రాజ్ తరుణ్

సారాంశం

యువ హీరో రాజ్ తరుణ్ త్వరలో ఓ ఇంటివాడవ్వబోతున్నాడు. నేటితరం హీరోలందరూ కెరీర్ పై ద్రుష్టి పెట్టి పెళ్లి అనే మ్యాటర్ ను మర్చిపోతున్నారు. నాలుగు పదుల వయసొచ్చినా కూడా దాంపత్య జీవితం గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదు. 

యువ హీరో రాజ్ తరుణ్ త్వరలో ఓ ఇంటివాడవ్వబోతున్నాడు. నేటితరం హీరోలందరూ కెరీర్ పై ద్రుష్టి పెట్టి పెళ్లి అనే మ్యాటర్ ను మర్చిపోతున్నారు. నాలుగు పదుల వయసొచ్చినా కూడా దాంపత్య జీవితం గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదు. అయితే రాజ్ తరుణ్ మాత్రం 'ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలనే'.. లైన్ ని ఫాలో అవుతున్నాడు. 

గత ఏడాది పెళ్లికి రెడీ అవుతున్నట్లు చెప్పిన రాజ్ తరుణ్ ఇప్పుడు అందుకు అడుగులు మొదలైనట్లు చెబుతున్నాడు.ప్రస్తుతం రాజ్ తరుణ్ ఒక సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఇద్దరి లోకం ఒకటే అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న కుర్ర హీరో ఇటీవల ట్విట్టర్ ఫాలోవర్స్ తో ముచ్చటించాడు. 

పెళ్లెప్పుడు అని అడిగిన ఒక ఫాలోవర్ కి రాజ్ తరుణ్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. త్వరలోనే ఈ విషయం గురించి పూర్తి క్లారిటీ ఇస్తానని లవ్ అరేంజిడ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు చెప్పాడు. అయితే పెళ్లి కూతురు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లవ్ అంటే గతంలో మనోడు హీరోయిన్స్ తో ప్రేమాయణాలు నడిపిస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఎవరైనా హీరోయిన్ ని పెళ్లి చేసుకోడుతున్నాడా అని మరో టాక్ మొదలైంది.  

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు