అదరగొట్టేసిన హీరోయిన్.. ఇంటర్‌లో 82% మార్కులు!

Siva Kodati |  
Published : May 28, 2019, 09:10 PM IST
అదరగొట్టేసిన హీరోయిన్.. ఇంటర్‌లో 82% మార్కులు!

సారాంశం

టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన మరాఠి చిత్రం సైరత్ ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఈ చిత్రంలో రింకు రాజ్ గురు హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో రింకు నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన మరాఠి చిత్రం సైరత్ ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఈ చిత్రంలో రింకు రాజ్ గురు హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో రింకు నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. సైరత్ చిత్రం 2016లో విడుదలయింది. ఆ చిత్రం విడుదలయ్యే సమయంలో రింకు 10వ తరగతి విద్యార్థిని మాత్రమే. 

ఇదిలా ఉండగా ఇటీవలే రింకు ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఇటీవల వెలువడిన మహారాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాల్లో రింకు 82 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. దీనితో నటిగానే కాదు, విద్యార్థిగా కూడా రింకు అదరగొట్టేస్తోందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం చదువుపై శ్రద్ద చూపేందుకే చాలామంది కష్టపడుతుంటారు. కానీ రింకు సినిమాల్లో నటిస్తూనే 82 శాతం మార్కులు సాధించింది. 

ఈ విషయాన్ని రింకు తండ్రి మీడియాకు వివరించారు. తన కుమార్తె సినిమాల్లో నటిస్తూనే గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేస్తుందని తెలిపారు. రియాలిటీకి దగ్గరగా, తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన సైరత్ చిత్రం అఖండ విజయం సాధించింది. ఏకంగా 100 కోట్ల వసూళ్లు రాబట్టి దేశం మొత్తం మరాఠి చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుకునేలా చేసింది.  

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు