
ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన చిత్రం `ది కాశ్మీర్ ఫైల్స్` ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలుస్తుంది. ఇందులో ఆయన చూపించిన పలు యదార్థ సంఘటనలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. వాస్తవాలకు ప్రతిరూపంగా నిలుస్తున్న ఈ చిత్రంపై ప్రధాని మోడీ సైతం ప్రశంసలు కురిపించారు. కశ్మీర్ పండిట్ల మీద జరిగిన హత్యాకాండ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. వివేక్ అగ్రిహోత్రి దర్శకత్వం వహించగా, అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి, వివేక్ అగ్నిహోత్రి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 11న విడుదలైంది.
మొదిటి రోజు కాస్త తక్కువ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. సినిమాకి మౌత్ టాక్ పెరగడంతో థియేటర్లు కూడా పెరిగాయి. మరింతగా విస్తరిస్తుంది. ఇప్పటికే ఈ సి నిమా దాదాపు ముప్పైకోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టడం విశేషం. విశేష ఆదరణతో థియేటర్‌లో రన్ అవుతున్న ఈ చిత్రంపై పలువురు రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల చిత్ర బృందం ప్రధాని మోడీని కలిసి సినిమా గురించి వివరించగా, ఆయన యూనిట్‌ని అభినందించారు.
ఇప్పుడు ఏకంగా ఈ సినిమా గురించి మాట్లాడారు ప్రధాని మోడీ. `ది కాశ్మీర్ ఫైల్స్` చిత్రం చాలా బాగుంది. మంచి సినిమా మీరంతా చూడండి. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి` అని మోడీ వెల్లడించారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన మోడీ తమ పార్టీ నాయకులకు ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. ఈ సందర్బంగా ఆయన సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ వీడియోని రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ఈ సినిమాలో కాశ్మీరీ పండిట్ల బాధను చూపించారు. మరో వైపు సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమాపై విపరీతమైన ప్రశంసలు రావడంతో జనాల్లో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఇక ప్రధానమంత్రి సైతం ఈ సినిమా పై పొగడ్తలు కురిపించడంతో ప్రజల్లో ఈ మూవీ పై ఆసక్తి పెరిగింది.
సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తొలిరోజు దేశవ్యాప్తంగా 600 స్క్రీన్లు మాత్రమే వచ్చాయి. కానీ, ఆదివారం నాటికి సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న మక్కువ చూసి స్క్రీన్ కౌంట్ 600 నుంచి 2000కి పెరిగింది. సినిమా షోలు కూడా ప్రతి నగరంలో రెట్టింపు అయ్యాయి. పెద్ద స్టార్లు లేకుండా దాదాపు 12 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈసినిమా 27 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి ప్రధాన పాత్రలో నటించారు.