ఓటీటీలో దుమ్ములేపుతున్న రాజ్‌ తరుణ్‌, శివానీ రాజశేఖర్‌ జంట.. `అహ నా పెళ్ళంట` రికార్డ్‌ వ్యూస్‌

Published : Nov 25, 2022, 06:21 PM ISTUpdated : Nov 25, 2022, 06:23 PM IST
ఓటీటీలో దుమ్ములేపుతున్న రాజ్‌ తరుణ్‌, శివానీ రాజశేఖర్‌ జంట.. `అహ నా పెళ్ళంట` రికార్డ్‌ వ్యూస్‌

సారాంశం

రాజ్‌ తరుణ్‌ రూట్‌ మార్చాడు. వెండితెరపై కాకుండా బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. `అహ నా పెళ్లంట` వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఇది రికార్డు వ్యూస్‌ రాబట్టుకుంటోంది.

శివానీ రాజశేఖర్‌ మొదట్లో కెరీర్‌ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకుంటోంది. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మరోవైపు వరుస ఫ్లాపుల్లో ఉన్న రాజ్‌ తరుణ్‌ రూట్‌ మార్చాడు. వెండితెరపై కాకుండా బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. `అహ నా పెళ్లంట` వెబ్‌ సిరీస్‌లో నటించారు. రాజ్‌ తరుణ్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా నటించారు. నవంబర్‌ 17న విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌కి మంచి స్పందన లభిస్తుంది. అంతేకాదు రికార్డు వ్యూస్‌ సాధించింది. 

జీ5లో విడుదలైన `అహనా పెళ్ళంట` వెబ్‌ సిరీస్‌ ఏకంగా 50 మిలియన్స్‌ వ్యూయింగ్‌ మినిట్స్ మార్క్ ని రీచ్‌ అయ్యింది. తాజాగా చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. రొమాంటిక్‌ కామెడీ గా రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌.. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ 50 మిలియ‌న్ వ్యూయింగ్‌ మినిట్స్ మార్క్‌ను రీచ్ అయ్యిందని టీమ్‌ తెలిపారు. అంతే కాదు ఐఎండీబీ ప్ర‌క‌టించిన టాప్ టెన్ ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన వెబ్ సిరీస్‌ల లిస్టులోనూ ‘అహ నా పెళ్ళంట’ చోటు ద‌క్కించుకుందట. తెలుగులో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైనింగ్ సిరీస్‌ను అన్నీ భాష‌ల్లో ప్ర‌మోట్ చేశారు. కంటెంట్ చాలా బావుంద‌ని అన్నీ చోట్ల నుంచి సూప‌ర్బ్‌ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ వెబ్‌ సిరీస్‌ కథ పరంగా చూస్తే, ఓ పాతికేళ్ల యువ‌కుడు పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. ఈ క్ర‌మంలో అత‌ను ఎదుర్కొన్న స‌మ‌స్యలేంట‌నేదే అస‌లు క‌థ‌.  క‌థానాయ‌కుడు పెళ్లి చేసుకోవాల‌నుకున్న‌ పెళ్లి కూతురు  త‌న ప్రేమికుడితో వెళ్లిపోతుంది. అప్పుడు హీరో ఆమెపై ప్ర‌తీకారం తీర్చుకోవాలనుకుంటాడు. తీరా ఆ క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌నేదే సినిమా. ఇది సినీ విమ‌ర్శ‌కుల ప్రశంసలను అందుకుంది. హీరో రాజ్ త‌రుణ్‌, హీరోయిన్ శివానీ రాజ‌శేఖ‌ర్ మ‌ధ్య  కెమిస్ట్రీ మెయిన్ హైలైట్ అని ఆడియెన్స్ చెబుతుండటం విశేషం. హీరో హీరోయిన్ జోడీ మ‌ధ్య ఉండే కెమిస్ట్రీతో పాటు క్లీన్ కామెడీ, రొమాన్స్ అన్నీ చ‌క్క‌గా కుటుంబం అంతా క‌లిసి చూసేలా ఉంద‌ని అంద‌రూ అంటున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Deepika Padukone: పదేళ్లు పూర్తి చేసుకున్న దీపికా పదుకొణె హిస్టారికల్ మూవీ.. ఆమె బెస్ట్ లుక్స్ చూశారా
సుజీత్ కి పవన్ కారు గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చారో తెలుసా ? అంత పెద్ద త్యాగం చేశాడా, హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే