
పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చాక హాలీవుడ్ టెక్నిషియన్ల డిమాండ్ పెరుగుతుంది. క్వాలిటీ కోసం, క్రేజ్ వైజ్‌గా హాలీవుడ్ టెక్నిషియన్లని దించుతున్నారు మన టాలీవుడ్ మేకర్స్. తాజాగా తన సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌ని దించారు సుధీర్‌బాబు. ప్రస్తుతం ఆయన `హంట్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమాకి యాక్షన్ సీన్లకి సంబంధించి హాలీవుడ్ టెక్నిషయన్ పనిచేశారని చెబుతుంది యూనిట్.
సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న `హంట్` చిత్రాన్ని భవ్య భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు చెబుతూ, `హంట్`లో స్టంట్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయని, హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉంటాయని తెలిపింది. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన చాలా సినిమాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ తమ `హంట్`లో స్టంట్స్ కంపోజ్ చేశారు. మూవీలో అవి హైలైట్ అవుతాయని దర్శక నిర్మాతలు చెప్పారు.
నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ, `హాలీవుడ్‌లో రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ చాలా సినిమాలకు వర్క్ చేశారు. ఇప్పుడు వస్తున్న 'జాన్ విక్ 4'కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. మా సినిమాలో వాళ్ళ ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. వారి ఫైట్స్ తెరపై గూస్ బంమ్స్ తెప్పించనున్నాయి. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం. ఆల్రెడీ విడుదలైన టీజర్, 'పాపతో పైలం...' పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది` అని చెప్పారు.
ఈ చిత్రంలో సుధీర్‌బాబుతోపాటు శ్రీకాంత్, `ప్రేమిస్తే` భరత్ కీలక పాత్రలు పోషించారు. వాళ్లిద్దరు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్లుగా కనిపిస్తారట. అయితే సుధీర్‌కి హీరోయిన్ లేకవడం గమనార్హం. ఇక ఇందులో మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు ఇతర తారాగణం.
'హంట్' సినిమా సాంకేతిక వర్గం :
ఆర్ట్ డైరెక్టర్ : వివేక్ అన్నామలై, కాస్ట్యూమ్ డిజైనర్ : రాగ రెడ్డి, యాక్షన్ : రేనౌడ్ ఫవేరో (యూరోప్), స్టంట్స్ : వింగ్ చున్ అంజి, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం : మహేష్.