నేటి సంగీతంపై మ్యూజికల్‌ మ్యాస్ట్రో ఇళయరాజా షాకింగ్‌ కామెంట్స్

By Aithagoni RajuFirst Published Jul 23, 2021, 1:42 PM IST
Highlights

కొత్తగా అత్యాధునిక హంగులతో మ్యూజిక్‌ స్టూడియోని నిర్మించారు ఇళయరాజా. ఈ స్టూడియోని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇళయరాజా మీడియాలో ముచ్చటించారు. అనేక విషయాలను ఆయన పంచుకున్నారు. 

నేటితరం సంగీత దర్శకులపై మ్యూజికల్‌ మ్యాస్ట్రో ఇళయరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటి సంగీతం రెండు రోజుల్లోనే కనుమరుగైపోతుందన్నారు. సంగీతం నిత్యం కొత్తగా ఉండాలని, నిత్యం వికసిస్తున్న పువ్వూలా ఉండాలన్నారు. ఆయన కోడంబాక్కం హైవే రోడ్డులోని మహాలింగపురంలో కొత్తగా అత్యాధునిక హంగులతో మ్యూజిక్‌ స్టూడియోని నిర్మించారు. ఈ స్టూడియోని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇళయరాజా మీడియాలో ముచ్చటించారు. అనేక విషయాలను ఆయన పంచుకున్నారు. 

తాను ఇప్పటి వరకు 1300 చిత్రాలకు సంగీతం అందించినట్టు చెప్పింది. తన ప్రయాణం ఇంకా కొనసాగుతుందని, తన సంగీతానికి ముగింపు లేదన్నారు. తన కొత్త స్టూడియోలో ఎంతో మంది కొత్త కళాకారులతో కొత్త చిత్రాలకు సంగీత రికార్డింగ్‌ కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతున్నాయన్నారు. కరోనా కారణంగా మ్యూజిక్‌ కంపోజింగ్‌ పనులు కాస్త నెమ్మదించాయి. అలాగే లాక్‌డౌన్‌ సమయంలో సంగీతం అనేది చాలా మందికి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే బెస్ట్ మెడిసిన్‌గా ఉపయోగపడిందని చెప్పారు. 

రెండు దశాబ్దాల క్రితం కంపోజింగ్‌ చేసిన పాటలనే ఇప్పటికీ అనేక మంది మళ్లీ మళ్లీ వింటూ ఆనందిస్తున్నారు. సంగీతం అనేది ఒకటి రెండు రోజుల్లో వాడిపోయే పువ్వులా ఉండకూడదు. అప్పుడే వచ్చిన మొగ్గలా, నిత్యం వికసిస్తున్నపుష్పంలా ఉండాలని తెలిపారు. మనస్సు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుందని తెలిపారు. నేటి సంగీతం, పాటలు రెండు రోజుల్లో మరిపోతున్నారని నేటితరం సంగీతంపై ఆయన చురకలంటించారు. 

తన కుమారులు కార్తీక్‌ రాజా, యువన్‌ శంకర్‌ రాజాల పిల్లలైన యతీశ్వరన్‌, జియాలకు సంగీతం అనేది పుట్టుకలోనే ఉంది. అందుకే వారు ఇప్పుడే అందరి ప్రశంసలు అందుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఇళయరాజా తెలుగు, తమిళం దాదాపు ఇరవై సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. అందులో `సన్నాఫ్‌ ఇండియా`, `గమనం`, `క్లాప్‌` వంటి తెలుగు చిత్రాలున్నాయి. 

click me!