Rashmika Mandanna: ఫస్ట్ టైమ్‌ సరికొత్త పాత్రలో రష్మిక.. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం

Surya Prakash   | Asianet News
Published : Jan 12, 2022, 12:14 PM ISTUpdated : Jan 12, 2022, 08:07 PM IST
Rashmika Mandanna: ఫస్ట్ టైమ్‌ సరికొత్త పాత్రలో రష్మిక.. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం

సారాంశం

తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లోను తన జోరు చూపించే దిశగా ఆమె ప్రయాణం కొనసాగుతోంది. తెలుగులో రీసెంట్ గా ఆమె చేసిన 'పుష్ప' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది.

‘ఛలో’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా కెరీర్ లో దూసుకుపోతోంది.  విజయ్‌ దేవరకొండ సరసన నటించి ‘గీత గోవిందం’ సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఆతర్వాత ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘దేవదాస్‌’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్ సొంతం చేసుకుంది. తాజాగా ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో జంటగా నటించిన ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రంతో తన ఖాతాలో మరో భారీ విజయాన్ని వేసుకుంది రష్మిక. ఇందులో శ్రీవల్లిగా ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఇలా వరుస సక్సెస్ లతో దూసుకెళుతోన్న ఈ అందాల తార ఇప్పుడు ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ స్టోరీకి సైన్ చేసిందని సమాచారం.
 
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకి, రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో రష్మిక  ఓ కింది స్థాయి నుంచి బిజినెస్‌ ఉమెన్‌గా ఎదిగే పాత్రలో కనిపించబోతుందట. పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, తనకి మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకంతో ఉందట. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని సమాచారం.
 
ఈ ముద్దుగుమ్మ  తన అల్లరి చేష్టలు, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు గుండెల్లో నేషనల్‌ క్రష్‌గా మారిపోయింది. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రేసులో ఇప్పుడు రష్మిక ముందు వరుసలో కనిపిస్తోంది. వరుస సినిమాలతో .. వరుస హిట్లతో ఆమె దూసుకుపోతోంది. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లోను తన జోరు చూపించే దిశగా ఆమె ప్రయాణం కొనసాగుతోంది. తెలుగులో రీసెంట్ గా ఆమె చేసిన 'పుష్ప' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది.

ఇక పాన్‌ ఇండియా చిత్రంగా వచ్చిన ‘పుష్ప: ది రైజ్‌’ కోసం ఆమె సుమారు రూ.2 కోట్ల పారితోషకం తీసుకుందని సమాచారం. అయితే సినిమా 5 భాషల్లో రిలీజ్‌ కావడం, సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో తన రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘పుష్ప: ది రూల్‌’ తో పాటు రాబోయే కొత్త సినిమాలకు ఏకంగా రూ. 3 కోట్ల వరకు డిమాండ్‌ చేసిందని తెలుస్తోంది. కాగా పుష్ప సీక్వెల్‌తో పాటు శర్వానంద్‌కు జంటగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక హిందీలో ‘మిషన్‌ మజ్ను’, ‘గుడ్‌ బై’ చిత్రాలు చేస్తోంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?