Navneeth Kaur: జంతువులంటే ఎంత ప్రేమ... 60 ఒంటెల ప్రాణాలు కాపాడిన హీరోయిన్ నవనీత్ కౌర్!

Published : Jan 12, 2022, 11:43 AM ISTUpdated : Jan 12, 2022, 11:44 AM IST
Navneeth Kaur: జంతువులంటే ఎంత ప్రేమ... 60 ఒంటెల ప్రాణాలు కాపాడిన హీరోయిన్ నవనీత్ కౌర్!

సారాంశం

నటి, పార్లిమెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్ (Navneeth Kaur)మూగజీవాల పట్ల తనకున్న ప్రేమ చాటుకున్నారు. వధశాలలకు తరలిస్తున్న 60 ఒంటెల ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఈ న్యూస్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది.   

హైదరాబాద్ తో పాటు చాలా ప్రాంతాల్లో ఒంటె మాంసానికి డిమాండ్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఒంటె మాసం విరివిగా లభిస్తుంది. ప్రత్యేక పండుగల సమయాల్లో దీని డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఒంటెల లభ్యత అధికంగా ఉండే రాజస్థాన్ నుండి వివిధ ప్రాంతాలకు ఒంటెలను తరలిస్తూ ఉంటారు. తాజాగా రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా వ్యాపారులు ఒంటెలను తరలిస్తున్నారు.  పక్కా సమాచారంతో నవనీత్ కౌర్ ఒంటెల రవాణాను అడ్డుకున్నారు.  అక్రమంగా తరలిస్తున్న 60 మూగజీవాల ప్రాణాలను నవనీత్‌ కౌర్‌  కాపాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ''ఇప్పటికే చాలా ఒంటెలను హైదరాబాద్‌కు తరలించారు. అమరావతి నియోజకవర్గంలో ఒంటెలను ఉంచినట్టు నాకు సమాచారం అందింది. వెంటనే అధికారులకు సమాచారం అందించాను. అధికారులు స్పందించి ఒంటెలను స్వాధీనం చేసుకున్నారు''. అని తెలిపారు. 

ఇక మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నవనీత్ కౌర్ తెలుగులో అధికంగా సినిమాలు చేశారు. కన్నడ, మలయాళ, తమిళ్ తో పాటు పంజాబీలో ఒకటి రెండు చిత్రాలు చేశారు. రాజమౌళి (Rajamouli)-ఎన్టీఆర్ కాంబినేషన్ లో  తెరకెక్కిన యమదొంగ మూవీలో నవనీత్ కౌర్ ఓ స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్ (NTR)తో పాటు స్టెప్స్ వేశారు. కెరీర్ ఆశాజకంగా లేకపోవడంతో ఆమె 2010లో సినిమాల నుండి తప్పుకున్నారు. 

2011లో మహారాష్ట్రకు చెందిన పొలిటీషియన్ రవి రాణాను ఆమె వివాహం చేసుకున్నారు. 2014లో ఎంపీగా పోటీ చేసి పరాజయం పొందారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర అమరావతి పార్లిమెంట్ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. ఇక ఫస్ట్ వేవ్ లో కరోనా బారిన పడిన నవనీత్ కౌర్ మృత్యువుతో పోరాడి.. తిగిరి కోలుకున్నారు. పార్లమెంటేరియన్ గా నవనీత్ కౌర్ ప్రసంగాలు గొప్పగా ఉంటాయి. ఆమె ప్రజా సమస్యలపై పోరాడే తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఒంటెల ప్రాణాల కోసం ఆమె చేసిన తాజా ప్రయత్నంతో మరోమారు వార్తల్లో నిలిచారు. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu: శుభకార్యం ఆపకపోతే ఫోటోలు బయట పెడతా.. శ్రీవల్లిని బ్లాక్ మెయిల్ చేస్తున్న విశ్వక్
రామ్ చరణ్ కి స్కూల్లో మార్కులు తక్కువ రావడానికి కారణమైన మరో హీరో ఎవరో తెలుసా?