ఎవర్ గ్రీన్ 'మాయాబ‌జార్' పై డాక్యుమెంట‌రీ.. డిటేల్స్

By Udayavani DhuliFirst Published Dec 11, 2018, 7:20 AM IST
Highlights

ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఎఎన్నార్, సావిత్రి వంటి మహామహాలు నటించిన  మాయాబజార్ తెలుగులోనే కాదు. యావత్ భారత చిత్ర సీమలో ఎవర్‌గ్రీన్ హిస్టారిక్ చిత్రం. ఈ చిత్రం ఆంధ్ర దేశమంతటా 1957, మార్చి 27 వ తేదీన విడుదలై అద్భుత విజయం సాధించింది. 

ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఎఎన్నార్, సావిత్రి వంటి మహామహాలు నటించిన  మాయాబజార్ తెలుగులోనే కాదు. యావత్ భారత చిత్ర సీమలో ఎవర్‌గ్రీన్ హిస్టారిక్ చిత్రం. ఈ చిత్రం ఆంధ్ర దేశమంతటా 1957, మార్చి 27 వ తేదీన విడుదలై అద్భుత విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ సినిమా గురించి జనం మాట్లాడుకుంటూనే ఉన్నారు.  ఈ సినిమాపై వివిధ టీవి ఛానళ్ళు , వార్తా పత్రికలు, వెబ్ మీడియా  అనేక ప్రత్యేక వ్యాసాలు అందించాయి. అయినా ఈ సినిమా గురించి జనాలకు ఆసక్తి వీడటం లేదు. అది గమనించే విజయా అధినేతలు ఈ సినిమాపై డాక్యుమెంటరీ అందించటానికి ముందుకు వస్తున్నారు.  

అతి త్వరలోనే `మాయాబ‌జార్‌` పై డాక్యుమెంటరీ విడుదల కానుంది. ఆ సినిమాలో పనిచేసి, మిగిలి ఉన్న వారందరి అభిప్రాయాలూ వీడియో తీస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి ఈ డాక్యుమెంటరీ ఆలోచన పుట్టింది. విజయా బి. నాగిరెడ్డి కుమారుడైన విశ్వనాథరెడ్డి ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లి అమలు పరిచారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ పులగం చిన్నారాయణ సారథ్యంలో దానికి కావాల్సిన వీడియో షూటింగ్‌ అంతా తీయించారు.

అంతేకాదు ఈ సినిమా మేకింగ్ పైనా `మాయాబ‌జార్ మ‌ధుర‌స్మృతులు` పేరుతో విజ‌యా ప‌బ్లికేష‌న్స్ (చెన్నై) ఓ పుస్త‌కాన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ చిత్ర నిర్మాణ విశేషాలు, తెర వెనుక కబుర్లు, మంచి ఫోటోలతో ఏకంగా పుస్తకమే రాయించారు.  పుస్తక ర‌చ‌న పూర్త‌యింది.  త్వ‌ర‌లోనే డాక్యుమెంట‌రీ లాంచ్‌తో పాటు, పుస్త‌కావిష్క‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. ` 

నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి, గుమ్మడి వెంకటేశ్వరరావు, ఋష్యేంద్రమణి, ఛాయాదేవి, సూర్య కాంతం, సంధ్య(దివంగత ముఖ్యమంత్రి జయలలిత తల్లి), సి.ఎస్.ఆర్ వంటి ఎందరో గొప్ప నటులు ఈ చిత్రంలో నటించారు.  

click me!