చిన్మయి చెప్పింది నిజమే.. నేనే అసభ్యంగా ప్రవర్తించా.. సింగర్ రఘు దీక్షిత్ కామెంట్స్!

By AN TeluguFirst Published 17, Jun 2019, 4:35 PM
Highlights

కన్నడ సింగర్ రఘు దీక్షిత్ తన భార్య, డాన్సర్ మయూరి విడాకులు తీసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

కన్నడ సింగర్ రఘు దీక్షిత్ తన భార్య, డాన్సర్ మయూరి విడాకులు తీసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన కాపురం విడాకుల వరకు వెళ్లడానికి గల కారణాలను రఘు చెప్పుకొచ్చాడు. తన భార్యకి విడాకులు ఇస్తున్న మాట నిజమేనని, కేసు చివరి దశలో ఉందని చెప్పారు.

మూడేళ్లుగా తామిద్దరం కలిసి ఉండడం లేదని, తన భార్య చాలా మంచిదని చెప్పారు. మంచి భర్తని కాలేక పరస్పర అవగాహనతో విడాకులు తీసుకోబోతున్నట్లు చెప్పారు. గాయని చిన్మయి గతంలో రఘు దీక్షిత్ పై మీటూ ఆరోపణలు చేసింది.

ఆ కారణంగానే రఘు కాపురంలో కలతలు వచ్చాయని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన రఘు.. గాయని చిన్మయి తనపై చేసిన ఆరోపణలు నిజమేనని ఒప్పుకున్నాడు. చిన్మయి చెప్పినట్లుగానే ఓ మహిళా సింగర్ తో అసభ్యంగా ప్రవర్తించానని స్పష్టం చేశారు.

ఓ పాటను రికార్డ్ చేస్తోన్న సమయంలో ఉద్వేగానికి లోనవ్వడంతో ఫిమేల్ సింగర్ ని గట్టిగా హత్తుకున్నానని, ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించానని చెప్పాడు. అయితే ఆ సమయంలో ఆమె తనను తోసేయడంతో వెంటనే క్షమాపణలు కూడా చెప్పినట్లు వెల్లడించాడు. ఇప్పుడు మరోసారి క్షమాపణలు బహిరంగంగా చెబుతున్నానని అన్నారు. ఈ  విషయం మయూరికి తెలిసిన కారణంగా తన భర్తతో ఉండలేక విడాకుల వరకు వెళ్లిందని టాక్. 

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 17, Jun 2019, 4:35 PM