'జనతా గ్యారేజ్' సౌండ్ మళ్ళీ వినిపిస్తుందా.. ఎన్టీఆర్ మాటిచ్చాడు!

Published : Jun 17, 2019, 04:24 PM IST
'జనతా గ్యారేజ్' సౌండ్ మళ్ళీ వినిపిస్తుందా.. ఎన్టీఆర్ మాటిచ్చాడు!

సారాంశం

మూడేళ్ళ క్రితం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గారేజ్ చిత్రం ఘనవిజయం సాధించింది. జనతా గ్యారేజ్ తరహాలో మళ్ళీ ఎన్టీఆర్ రీసౌండ్ పుట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

'బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఎ చేంజ్.. ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలం ఉంది.. జనతా గ్యారేజ్' అంటూ డైలాగ్ చెప్పి రీసౌండ్ పుట్టించాడు ఎన్టీఆర్. మూడేళ్ళ క్రితం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గారేజ్ చిత్రం ఘనవిజయం సాధించింది. జనతా గ్యారేజ్ తరహాలో మళ్ళీ ఎన్టీఆర్ రీసౌండ్ పుట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో మరో చిత్రం తెరకెక్కబోతోందంటూ టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాదికి పూర్తవుతుంది. కొరటాల శివ కూడా త్వరలో మెగాస్టార్ చిరంజీవితో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక వచ్చే ఏడాది ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రానికి సంబంధించిన వర్క్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మన కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుందని కొరటాలకు గతంలోనే ఎన్టీఆర్ మాటిచ్చాడట. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో మరో పవర్ ఫుల్ మూవీని ఆశించవచ్చు. 

PREV
click me!

Recommended Stories

Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు
Emmanuel కి బిగ్‌ బాస్‌ తెలుగు 9 ట్రోఫీ మిస్‌ కావడానికి కారణం ఇదే.. చేసిన మిస్టేక్‌ ఏంటంటే?