చిన్నప్పుడు ప్రభాస్‌ ఎలా ఉన్నాడో చూశారా? అరుదైన ఫోటో పంచుకున్న దర్శకేంద్రుడు

Published : Oct 23, 2020, 03:11 PM IST
చిన్నప్పుడు ప్రభాస్‌ ఎలా ఉన్నాడో చూశారా? అరుదైన ఫోటో పంచుకున్న దర్శకేంద్రుడు

సారాంశం

డార్లింగ్‌ ప్రభాస్‌కి స్పెషల్‌ విశెష్‌ చెబుతూ రాఘవేంద్రరావు ప్రభాస్‌ ఫోటోలను పంచుకున్నారు. అందులో ఒకటి రాఘవేంద్రరావు, ప్రభాస్‌ కలిసి ఉన్న ఫోటో, మరొకటి, చిన్నప్పుడు ప్రభాస్‌ని తండ్రి ఎత్తుకుని దిగిన ఫోటో. ఇవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మనం మన చిన్నప్పటి ఫోటోని చాలా రోజుల తర్వాత చూస్తేనే ఎంతో సంతోషిస్తాం. అదొక మధురమైన జ్ఞాపకంలా చూసుకుంటున్నాం. మనకు నచ్చిన వారి చిన్నప్పటి ఫోటో చూస్తే కచ్చితంగా అదో సర్‌ప్రైజింగ్‌ లా అనిపిస్తుంటుంది. ఇక అభిమాన హీరో చిన్ననాటి ఫోటో కచ్చితంగా స్పెషల్‌గానే ఉంటుంది. ప్రభాస్‌కి చెందిన అలాంటి ఓ చిన్ననాటి ఫోటోని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పంచుకున్నారు. 

శుక్రవారం ప్రభాస్‌ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డార్లింగ్‌ ప్రభాస్‌కి స్పెషల్‌ విశెష్‌ చెబుతూ రాఘవేంద్రరావు ప్రభాస్‌ ఫోటోలను పంచుకున్నారు. అందులో ఒకటి రాఘవేంద్రరావు, ప్రభాస్‌ కలిసి ఉన్న ఫోటో, మరొకటి, చిన్నప్పుడు ప్రభాస్‌ని తండ్రి ఎత్తుకుని దిగిన ఫోటో. ఇవి ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేస్తూ, `నా తమ్ముడు లాంటి సూర్య నారాయణరాజు కొడుకు.. మా ప్రభాస్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. రాబోయే చిత్రాలతో ఇంకెంతో కీర్తి సాధించాలని ఆశీర్వదిస్తున్నాను` అని హ్యాపీ బర్త్ డే ప్రభాస్‌ అని ట్వీట్‌ చేశారు. <blockquote class="twitter-tweet"><p lang="te" dir="ltr">నాకు తమ్ముడు లాంటి సూర్య నారాయణరాజు కొడుకు, మా ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు... రాబోయే చిత్రాలతో ఇంకెంతో కీర్తి సాధించాలని ఆశీర్వదిస్తున్నాను... <a href="https://twitter.com/hashtag/HappyBirthdayPrabhas?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#HappyBirthdayPrabhas</a> <a href="https://t.co/OTKol2a1MB">pic.twitter.com/OTKol2a1MB</a></p>&mdash; Raghavendra Rao K (@Ragavendraraoba) <a href="https://twitter.com/Ragavendraraoba/status/1319554661142024193?ref_src=twsrc%5Etfw">October 23, 2020</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

దీనికి విశేష స్పందన లభిస్తుంది. ప్రభాస్‌ అభిమానులు ఈ ఫోటోని చూసి మురిసిపోతున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావుకి థ్యాంక్స్ చెబుతున్నారు. తమ అభిమాన నటుడి ఫోటోని చూసి సంబరపడుతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్