బాక్సాఫీస్‌ విజేత.. డార్లింగ్‌కి మెగాస్టార్‌, వెంకీ సర్‌ప్రైజ్‌

Published : Oct 23, 2020, 01:44 PM IST
బాక్సాఫీస్‌ విజేత.. డార్లింగ్‌కి మెగాస్టార్‌, వెంకీ సర్‌ప్రైజ్‌

సారాంశం

యూనివర్సల్‌ స్టార్‌ ప్రభాస్‌ బర్త్ డే సందడి కొనసాగుతుంది. సెలబ్రిటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌, విక్టరీ వెంకటేష్‌ స్పందించారు. ప్రభాస్‌కి బర్త్ డే విశెష్‌ చెప్పి ఊహించని సర్ప్రైజ్‌ ఇచ్చారు. 

యూనివర్సల్‌ స్టార్‌ ప్రభాస్‌ బర్త్ డే సందడి కొనసాగుతుంది. సెలబ్రిటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ స్పందించారు. ప్రభాస్‌కి బర్త్ డే విశెష్‌ చెప్పి ఊహించని సర్ప్రైజ్‌ ఇచ్చారు. `మా ప్రియమైన ప్రభాస్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎగ్జైటింగ్‌ ప్రాజెక్ట్ లతో మీకు మంచి భవిష్యత్‌ ఉండాల`ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్‌తో దిగిన ఫోటోని పంచుకున్నారు. 

మరోవైపు విక్టరీ వెంకటేష్‌ సైతం ట్విట్టర్‌ వేదికగా ప్రభాస్‌కి బర్త్ డే విశెష్‌ తెలిపారు. ప్రేమని, సంతోషాన్ని పంచారు. అలాగే సంపత్‌ నంది స్పందిస్తూ `బాక్సాఫీస్‌ తిరుగులేని విజేత అంటూ జిలియన్‌ హార్ట్ తో బర్త్ డే విశెష్‌ తెలిపారు. దర్శకుడు గుణశేఖర్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ సైతం ప్రభాస్‌తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ విశెష్‌ తెలిపారు. 

ఇదిలా ఉంటే తన పుట్టిన రోజు కానుకగా ప్రభాస్‌ తన అభిమానులకు `రాధేశ్యామ్‌` టీజర్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది విశేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు కొత్త లుక్‌ సైతం విశేషంగా మెప్పిస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్