భర్తకు అనుష్క శర్మ బర్త్ డే విషెస్.. కోహ్లీపై అమితమైన ప్రేమను తెలిపిన స్టార్ హీరోయిన్

By Asianet News  |  First Published Nov 5, 2023, 2:58 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ తన భర్త, స్టార్ క్రికెటర్ కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా కొన్ని బ్యూటీఫుల్ ఫొటోలను షేర్ చేస్తూ.. కోహ్లీపై తనకున్న అమితమైన ప్రేమను షార్ట్ నోట్ తో వర్ణించింది. 
 


స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)  బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.  కింగ్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్, కోహ్లీ భార్య  అనుష్క శర్మ (Anushka Sharma)  చాలా స్పెషల్ గా విష్ చేసింది. తన భర్తపై ఉన్న ప్రేమను తెలియజేసేలా శుభాకాంక్షలు తెలిపింది. ఇన్ స్టా వేదికన బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకుంటూ కోహ్లీ పుట్టినరోజును మరింత ప్రత్యేకం చేసింది.

అనుష్క శర్మ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తన భర్తకు విషెస్ తెలుపుతూనే, ఆమెకున్న అమితమైన ప్రేమనూ వర్ణించింది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ తన కెరీర్ లో సాధించిన ఘనతను గుర్తుచేసేలా ఓ ఫొటోలను పంచుకుంది. అలాగే కింగ్ కోహ్లీ క్రేజీ స్టిల్ ను, భర్తతో హ్యాపీ సెల్ఫీలని కూడా అభిమానులతో షేర్ చేసుకుంది. అలాగే ఇంట్రెస్టింగ్ నోట్ రాసుకొచ్చింది. కోహ్లీపై ఇప్పటి వరకు తనకున్న ప్రేమను తెలియజేసింది.

Latest Videos

undefined

నోట్ లో.. ‘అతను తన జీవితంలోని ప్రతి పాత్రలో అక్షరాలా అసాధారణంగా ఉంటాడు. ఇదే సమయంలో అతని అద్భుతమైన జర్నీ మరింతగా కొనసాగిస్తున్నాను. జీవితంలో నేను నిన్ను (కోహ్లీ) అనంతంగా, అమితంగా ప్రేమిస్తున్నాను. అందుకే ప్రతి మలుపులో.. ఎలాంటి సందర్భాల్లోనైనా  నీవెంటే ఉంటాను.’ అంటూ చెప్పుకొచ్చింది. అనుష్క శర్మ తనప్రేమను వర్ణించిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్, ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 1988 నవంబర్ 5న జన్మించిన కోహ్లీ ఈ ఏడాదితో 35వ ఏటా అడుగుపెట్టారు.

 

click me!