శ్రీలంక బాంబ్ పేలుళ్లు.. తప్పించుకున్న సినీ నటి!

Published : Apr 21, 2019, 02:06 PM IST
శ్రీలంక బాంబ్ పేలుళ్లు.. తప్పించుకున్న సినీ నటి!

సారాంశం

శ్రీలంక రాజధాని కొలంబోలో ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో వరుస బాంబ్ పేలుళ్లు జరిగాయి.

శ్రీలంక రాజధాని కొలంబోలో ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో వరుస బాంబ్ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో దాదాపు 160కి పైగా మృత్యువాత పడగా.. 400 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. 

ఈస్టర్ సండే సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్న భక్తులను లక్ష్యంగా పెట్టుకొని ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. కొలంబోలో మొత్తం ఆరు ప్రాంతాల్లో బాంబ్ దాడులు జరిగినట్లు సమాచారం. వాటిల్లో సిన్నామన్ గ్రాండ్ హోటల్ కూడా ఉంది. అయితే ఈ ఘటన నుండి త్రుటిలో బయటపడినట్లు నటి రాధికా శరత్ కుమార్ వెల్లడించారు. 

సిన్నామన్ గ్రాండ్ హోటల్ లో స్టే చేసిన రాధికా.. బాంబ్ దాడికి కొద్ది నిమిషాల ముందు ఆమె హోటల్ నుండి వెళ్లిపోయారట. దాంతో ఆమె ఈ దాడి నుండి తప్పించుకోగలిగింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న రాధికా షాకింగ్ గా ఉందని.. దేవుడు అందరితో ఉండాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 

 

PREV
click me!

Recommended Stories

మహేష్ బాబు నమ్మి అవకాశం ఇస్తే.. నిండా ముంచిన డైరెక్టర్లు ఎవరో తెలుసా?
జాతకాలు నమ్మడం వల్ల ఆగిపోయిన బాలకృష్ణ సినిమా..గ్రహాలు అనుకూలించిన తర్వాత చేద్దాం అనుకున్నారు కానీ