బుల్లితెరపైకి స్టార్ హీరోయిన్!

Published : Apr 21, 2019, 12:38 PM IST
బుల్లితెరపైకి స్టార్ హీరోయిన్!

సారాంశం

ఒకప్పటి నటీనటులతో పోలిస్తే ఇప్పటి తారలు బుల్లితెరపై కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా అగ్రనటి నయనతార కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుందని సమాచారం.

ఒకప్పటి నటీనటులతో పోలిస్తే ఇప్పటి తారలు బుల్లితెరపై కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా అగ్రనటి నయనతార కూడా బుల్లితెర ప్రేక్షకులనుఅలరించడానికి సిద్ధమవుతుందని సమాచారం.

తన సినిమాల ప్రమోషన్స్ కి కూడా హాజరు కాని నయనతార ఇప్పుడు టీవీ షోలో కనిపించాలనుకోవడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ షోకి సంబంధించి ఒక ప్రోమోని విడుదల చేసింది కలర్స్ టీవీ ఛానెల్. అయితే ఆ ఛానెల్ లో ఏ కర్యక్రమంలో నయనతార పాల్గొనబోతున్నారన్నది సస్పెన్స్ గా ఉంచారు. 

ఈ ఛానెల్ లో ప్రసారం కానున్న ఓ డాన్స్ కార్యక్రమానికి నటి నయనతార అతిథిగా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక డాన్స్ ప్రోగ్రాంకి రెండు జట్లకు ఇద్దరు అతిథులు ఉంటారు. అయితే ఆ డాన్స్ ప్రోగ్రాంకి వారానికి ఒక కొత్త అతిథి పాల్గొంటారని, అలా ఒక వారంలో నటి నయనతార గెస్ట్ గా పాల్గొనబోతున్నారని టాక్.

ఈ షో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నయనతార రజినీకాంత్ తో కలిసి 'దర్బార్' సినిమాలో నటిస్తున్నారు. అలానే ఆమె నటించిన 'కొలైయుధీర్‌ కాలం' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 

 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?