Chiranjeevi: క్రేజీ న్యూస్.. చిరంజీవితో సినిమా ప్రకటించిన సీనియర్ హీరోయిన్, బ్లాక్ బస్టర్ లోడింగ్

Published : May 01, 2022, 09:11 AM IST
Chiranjeevi: క్రేజీ న్యూస్.. చిరంజీవితో సినిమా ప్రకటించిన సీనియర్ హీరోయిన్, బ్లాక్ బస్టర్ లోడింగ్

సారాంశం

సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ గురించి పరిచయం అవసరం లేదు. 80,90 దశకాల్లో రాధిక టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, రాధికలది వెండితెరపై తిరుగులేని కాంబినేషన్.  

సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ గురించి పరిచయం అవసరం లేదు. 80,90 దశకాల్లో రాధిక టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, రాధికలది వెండితెరపై తిరుగులేని కాంబినేషన్.  

రాధిక, చిరంజీవి కాంబినేషన్ లో అభిలాష, దొంగమొగుడు, యమకింకరుడు, రాజా విక్రమార్క, హీరో లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ చాలా మంది యువతకు ఇప్పటికీ ఫేవరిట్ గా ఉంటాయి. అంతలా చిరు, రాధిక జంట మ్యాజిక్ చేసింది.  

ఇదిలా ఉండగా రాధికా తాజాగా క్రేజీ న్యూస్ ప్రకటించారు. రాధికా భర్త శరత్ కుమార్ కూడా సీనియర్ నటుడే. శరత్ కుమార్ చిరంజీవితో కలసి గ్యాంగ్ లీడర్, స్టువర్టుపురం చిత్రాల్లో నటించారు. చిరంజీవి శరత్ కుమార్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా శరత్ కుమార్ చిరంజీవి గొప్పతనాన్ని వివరిస్తుంటారు. 

తాజాగా రాధికా తన ట్విట్టర్ లో అదిరిపోయే న్యూస్ ప్రకటించింది. త్వరలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా.. శరత్ కుమార్ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. శరత్ కుమార్ రాడాన్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. 

'శరత్ కుమార్ రాడాన్ బ్యానర్ లో సినిమా చేసేందుకు అంగీకరించిన ప్రియమైన చిరంజీవి ధన్యవాదాలు. త్వరలో ఈ చిత్రం ఉండబోతోంది. కింగ్ ఆఫ్ మాస్ తో బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించేందుకు ఆసక్తిగా ఉన్నాం' అంటూ రాధికా ట్విటర్ లో ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు.. నటీనటులు ఇతర వివరాలు త్వరలో తెలియనున్నాయి. అసలే ఆచార్య రిజల్ట్ తో మెగా ఫాన్స్ నిరాశలో ఉన్నారు. ఈ న్యూస్ చిరంజీవి అభిమానుల్లో కొంత జోష్ నింపుతుంది అనడంలో సందేహం లేదు. 

 

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌