Acharya:‘ఆచార్య’ USA లో షాకిచ్చిన కలెక్షన్స్

Surya Prakash   | Asianet News
Published : May 01, 2022, 06:39 AM IST
Acharya:‘ఆచార్య’ USA లో షాకిచ్చిన కలెక్షన్స్

సారాంశం

  అమెరికాలో ‘ఆచార్య’ సినిమా 400పైచిలుకు థియేటర్లలోని 3200పైగా స్క్రీన్‌లపై విడుదల చేసినట్టు ప్రైమ్ మీడియా చెప్పింది. ఇక శనివారం ట్రెండ్ కూడా బాగా డల్ గా ఉందని చెప్తున్నారు.


మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆచార్య’ ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ  మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగాభిమానులు వేయి కళ్లతో ఎదురు చూశారు.  ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ఆసక్తిగా గమనించారు. పాటలు, ట్రైలర్ ద్వారా భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ మూవీ ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే సినిమాకు నెగిటివ్ టాక్ మార్నింగ్ షో నుంచే తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఓపినింగ్ డే బాగుందనిపించుకుంది. రెండో రోజు చాలా చోట్ల కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.

ఇక యుఎస్ మార్కెట్ విషయానికి వస్తే... ప్రీమియర్స్ , ఓపినింగ్ డే కలెక్షన్స్ కలపి  $804 K వచ్చాయని ట్రేడ్ చెప్తోంది. రామ్ చరణ్, చిరంజీవి వంటి ఇద్దరు స్టార్స్ కలిపి చేసిన చిత్రానికి ఇది చాలా చిన్న అంకె అని అంటున్నారు. అందులోనూ కొరటాల శివ సినిమాలకు అమెరికాలో మంచి ఆదరణ ఉంది. ఆయన గత చిత్రం భరత్ అనే నేను ..$3.4 వసూలు చేసింది.   అమెరికాలో ‘ఆచార్య’ సినిమా 400పైచిలుకు థియేటర్లలోని 3200పైగా స్క్రీన్‌లపై విడుదల చేసినట్టు ప్రైమ్ మీడియా చెప్పింది. ఇక శనివారం ట్రెండ్ కూడా బాగా డల్ గా ఉందని చెప్తున్నారు.

ఇదిలా ఉంటే.. భారీ అంచనాల  ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల ముందుకు వచ్చిన ‘ఆచార్య’ చూసిన కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బాగుంటుందేమో అనుకుంటే సోసో గా ఉందని..  సినిమాలో కొంత సాగదీత ఉందని పేర్కొంటున్నారు. అయితే ఫైట్‌ సన్నివేశాలు, పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయని చెబుతున్నారు.  

 కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించగా, తనికెళ్ల భరణి, సోనూ సూద్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.
 

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే