ఆ హీరోతో రాధికా ఆప్టే ఘాటు రొమాన్స్.. లీకైన ఫోటోలు!

Published : Jul 13, 2019, 09:26 AM ISTUpdated : Jul 13, 2019, 09:27 AM IST
ఆ హీరోతో రాధికా ఆప్టే ఘాటు రొమాన్స్.. లీకైన ఫోటోలు!

సారాంశం

బోల్డ్ కామెంట్స్, వివాదాలతో నిత్యం వార్తల్లో ఉండే నటి రాధికా ఆప్టే మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

బోల్డ్ కామెంట్స్, వివాదాలతో నిత్యం వార్తల్లో ఉండే నటి రాధికా ఆప్టే మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఓ సినిమాలో న్యూడ్ గా కనిపించి షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా ఓ కుర్ర హీరోతో ఘాటు రొమాన్స్ చేస్తూ కనిపించింది. అది సినిమా కోసమే అనుకోండి.. కానీ వీరిద్దరి రొమాన్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.

'స్లమ్ డాగ్ మిలియనీర్' నటుడు దేవ్ పటేల్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో 'వెడ్డింగ్ గెస్ట్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ బ్రిటీష్-అమెరికా సినిమా ఇండియాలో ఇంకా విడుదల కాలేదు. 2018, సెప్టెంబర్ 8న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దీన్ని ప్రదర్శించారు.

ఆ తరువాత ఈ ఏడాది మార్చి 1న అమెరికాలో విడుదల చేశారు. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. పాకిస్తాన్ లో నివసించే సమీరా అనే అమ్మాయిని బ్రిటన్ కి చెందిన ఓ అబ్బాయి కిడ్నాప్ చేస్తాడు. ఆ కిడ్నాప్ కావాలని చేశాడా..? లేక సమీరా ఇంట్లో నుండి పారిపోవడానికి వేసిన ప్లానా..? అనే సన్నివేశాలతో సినిమానడుస్తుంది.

ఈ సినిమాలో రాధికా ఆప్టే, దేవ్ పటేల్ ల మధ్య కొన్ని హాట్ సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమా ఇంకా ఇండియాలో విడుదల కాకపోవడంతో ఆ సన్నివేశాలు బయటకి రాలేదు. ట్రైలర్ లో కూడా ఆ సన్నివేశాలు కనిపించలేదు. కానీ ఇంటర్నెట్ లో మాత్రం లీకయ్యాయి. ఇద్దరి మధ్య లిప్ లాక్ సీన్లు వైరల్ అవుతున్నాయి.  

 

PREV
click me!

Recommended Stories

అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే
అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?