''తెలంగాణాలో ఆంధ్రా సినిమాలు చూడ‌టం లేదా?''

By AN TeluguFirst Published Jul 13, 2019, 8:13 AM IST
Highlights

దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందించిన మాస్ ఎంటర్టైనర్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకురానుంది. 

దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందించిన మాస్ ఎంటర్టైనర్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకురానుంది. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా మొత్తం తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. సినిమాలో ప్రధాన పాత్రలు తెలంగాణా యాసతోనే మాట్లాడతాయి.

ముఖ్యంగా హీరో పక్కా తెలంగాణా మాట్లాడుతుంటాడు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు పూరి జగన్నాథ్ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ పై సంచలన కామెంట్స్ చేశారు. సినిమాను చూసిన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సినిమాలో తెలంగాణా యాస ఎక్కువైందని 'మార్ ముంత.. చోడ్ చింత' అనే డైలాగ్ ఎవరికీ అర్ధం కావడం లేదని.. వైజాగ్ ఏరియాలో డబ్బులు రావేమో అని అన్నాడని పూరి సంచలన కామెంట్స్ చేశారు.

తెలంగాణా భాష అర్ధం కాకపోవడం ఏంటని...? ప్రశ్నించాడు. మరి ఇన్ని రోజులు తెలంగాణాలో ఆంధ్రా సినిమాలు చూడడం లేదా..? అని అడిగారు. వైజాగ్ లో ఎనభై శాతం మందికి హిందీ రాకపోయినా.. హిందీ సినిమాలు చూస్తుంటారని.. నలభై ఏళ్ల క్రితం వైజాగ్ లో అర్ధం కాకపోయినా.. చైనీస్ సినిమా చూశానని.. సినిమా బావుంటే జనాలు చూస్తారని.. బయ్యర్ డబ్బులు తక్కువ ఇవ్వడం కోసమే అలా అని ఉంటారని అన్నాడు. 

click me!