బాలయ్యపై పగబట్టిన హీరోయిన్లు, అప్పుడు రాధికా ఆప్టే, ఇప్పుడు విచిత్ర.. ఆరోపణల్లో నిజంఎంత...?

By Mahesh Jujjuri  |  First Published Nov 23, 2023, 11:17 AM IST

సోషల్ మీడియాలో బాలకృష్ణపై వస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత,..? బాలయ్య హీరోయిన్లను ఇబ్బందిపెడతారా..? తాజాగా విచిత్ర చేసిన ఆరోపణలే కాదు..గతంలో కూడా రాధికా ఆప్టే చేసిన ఆరోపణలు కూడా బాలయ్య గురించేనా..? 
 


ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటి నుంచో ఉంది. కాని ఈమధ్యనే అందరూ ఈ విషయంలో ఓపెన్ అవుతూ వస్తున్నారు. అయితే అందులో ఎంతమంది నిజంగా క్యాస్టింగ్ కౌచ్ కు గురయ్యారు అనేది తెలియదు కాని.. ఆరోపణలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొంత మంది ఈ విషయంలో ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. చిన్మయి లాంటివారు ఈ వియంలో వెంటనే స్పందించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కొన్ని విచిత్రపు మలుపులు తిరుగుతున్నాయి.  అసలు ఎప్పుడూ ఇలాంటి ఆరోపణల ఊసే లేని స్టార్ హీరోల వైపు వేలు చూపిస్తున్నాయి 

తాజాగా  తమిళ బిగ్ బాస్ బ్యూటీ విచిత్ర చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. అసలు పేరు చెప్పకుండా ఆమె చేసిన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు హీరో బాలకృష్ణ గురించే అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈవిషయంలో నిజానిజాలు తెలియవు కాని ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. అయితే బాలయ్యపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. అప్పుడు కూడా డైరెక్ట్  గా బాలకృష్ణను ఎవరూ అనలేదు. హీరోయిన్  రాధిక ఆప్టే తనను ఓ తెలుగు హీరో వేధించాడు అంటూ అప్పట్లో చెప్పింది. ఆమె కూడా ఎవరి పేరు చెప్పలేదు. అయితేు రాధికా అప్టేను వేధించింది బాలయ్యే అంటూ అప్పుడు ప్రచారం చేశారు. దీనికి కారణం కూడా లేకపోలేదు.. రాధికా ఆప్టే తెలుగులో హీరోయిన్ గా చేసింది బాలయ్య బాబు సరసన మాత్రమే. ఆమె బాలయ్యతో కలిసి లయన్ , లెజెండ్ సినిమాల్లో నటించింది.అయితే నిజంగా బాలయ్య హీరోయిన్లను టార్చర్ చేశాడా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. 

Latest Videos

undefined

తమిళ బిగ్ బాస్ బ్యూటీ విచిత్ర చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ బ్యూటీ తనను ఓ హీరో ఇబ్బంది పెట్టాడు అంటూ బిగ్ బాస్ షోలో కొన్ని ఆసక్తికరవ్యాఖ్యలు చేసింది. అయితే తమిళ్ హీరో కాదు... అని చెప్పింది తప్ప.. తెలుగు హీరో అని వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆ హీరో బాలకృష్ణ అంటూ ప్రచారం జరగుతుంది. ఆమె తెలుగులో నటించిన ఏకైక సినిమా  బాలయ్యది కావడంతో ఈ ప్రచారం జోరందుకుంది. 

అటురాధికా ఆప్టే చెప్పినా.. ఇటు విచిత్ర చెప్పినా.. బాలయ్య పేరును చెప్పలేదు. నిజానికి విచిత్ర  చెప్పింది కేవలం తమిళ హీరో కాదు.. అని మాత్రమే మరి ఏ భాష అనేది అసలు చెప్పలేదు. అటు సినిమా పేరు కూడా చెప్పుకుండా ఓ 20 ఏళ్ల క్రితం  ఓ స్టార్ హీరో వల్ల ఎన్నో వేధింపులకు గురయ్యాను అంటూ... ఆమె చెప్పింది. అంతే కాదు అడవిలో షూటింగ్ జరిగిందని కూడా ఆమె చెప్పడంతో.. బాలయ్యతో ఆమె చేసిన భలేవాడివి బాసు సినిమా అడువుల్లో షూటింగ్ జరగడంతో.. ఈ ఆరోపణలు చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు. 

అటు బాలీవుడ్  హీరోయిన్ రాధికా ఆప్టే కూడా ఓ సౌత్ హీరో తనను ఇబ్బంది పెట్టాడంటూ మాట్లాడింది. అయితే ఈ హీరోయిన్ తెలుగులో బాలకృష్ణతో కలిసి లెజెండ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా బాలయ్యనే అంతా అనుకున్నారు. బాలయ్య నిజంగా  హీరోయిన్లను వేధిస్తాడంటూ ఓ వర్గం గట్టిగా ప్రచారం చేశారు. అయితే బాలయ్య మంచి మనసు అందరికి తెలిసిందే. ఆయన కాంట్రవర్సీలు కూడా తెలిసిందే. మాటల్లో కఠినంగా ఉన్నా..బాలయ్య మనసు మంచిందటారు. 

అయితే పొలిటికల్ గా కూడా యాక్టీవ్ గా ఉన్న బాలయ్య పై యాంటిఫ్యాన్స్ తో పాటు.. పొలిటికల్ ప్రత్యర్ధులు కావాలని ఇలా బాలయ్యను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు.   ఆయన మీద యాంటి ఫ్యాన్స్ ఇలా ప్రచారం చేస్తున్నారంటూ బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. కొంత మంది ఫేమ్ కోసం.. ఫేమస్ అయ్యేందుకు డ్రామా కూడా ఆడొచ్చు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాదు.. ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న విచిత్ర లాంటి వారు.. అందులో ఫేమస్ అవ్వడం కోసం చేస్తున్న ఈ విచిత్ర వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదుంటున్నారు. 

click me!