Ram Charan: మైసూర్ బయలుదేరిన మెగా పవర్ స్టార్... నాన్ స్టాప్ గా ప్లాన్ చేసుకున్న రామ్ చరణ్,

Published : Nov 23, 2023, 10:02 AM IST
Ram Charan: మైసూర్ బయలుదేరిన మెగా పవర్ స్టార్... నాన్ స్టాప్ గా ప్లాన్ చేసుకున్న రామ్ చరణ్,

సారాంశం

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మైసూర్ బయలుదేరారు. ఆయన ప్రయాణానిక సబంధించిన పిక్స్ కొన్ని బయటకు వచ్చాయి. గేమ్ చేంజర్ షూటింగ్ లో భాగంగా ఆయన అక్కడికి వెళ్తున్నట్టు తెలుస్తోంది.   

బ్రేక్ లు వేసుకుంటూ సాగుతోంది గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ విషయంలో శంకర్ పై కాస్త కోపంగానే ఉన్నారు. షూటింగ్ ఎలా ఉన్నా.. సాలిడ్ అప్ డేట్ ఒకటి ఇస్తారేమో అన్న ఆశలో ఉన్నారు. కాని గేమ్ చేంజర్ నుంచి ఎటువంటి అప్ డేట్ రాకపోవడంతో..నిరశాలో ఉన్నారు. షూటింగ్ అప్ డేట్ అయినా ఇస్తారా అంటే అది కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు టీమ్. ఇక తాజాగా ఈమూవీకి సబంధించి అప్ డేట్ ఒకటి వైరల్ అవుతోంది. 

చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' సినిమా రూపొందుతోంది. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. ఇటీవలే హైదరాబాదులో ఒక షెడ్యుల్ ను పూర్తిచేశారు. తరువాత షెడ్యూల్ ను 'మైసూర్' లో ప్లాన్ చేశారు. ఈరోజు (నవంబర్ 23) ఈ షెడ్యూల్ షూటింగ్ అక్కడ స్టార్ట్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగులో పాల్గొనడానికి చరణ్ మైసూర్ వెళ్ళారు. నిన్న రాత్రి  ఎయిర్ పోర్టులో ఆయన కారు దిగి వెళుతున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. 

ఇక ఈరోజు  నుంచి జరిగే షూటింగ్ లో  రామ్ చరణ్ తో పాటు గేమ్ చేంజర్ కు సబంధించి మెయిన్ లీడ్ అంతా పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీమ్ అంతా మైసూర్ చేరుకున్నారట.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా శంకర్ భారీ ఎత్తున ప్లాన్ చేశాడు. . భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్, సునిల్,జయరాం, అంజలీ, నాజర్ లాంటి స్టార్స్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?