Radheshyam: `రాధేశ్యామ్‌` లవ్‌ ఆంథెమ్‌.. లవర్‌బాయ్‌ లుక్‌లో ప్రభాస్‌ కనువిందు

Published : Nov 29, 2021, 07:57 PM ISTUpdated : Nov 29, 2021, 08:04 PM IST
Radheshyam: `రాధేశ్యామ్‌` లవ్‌ ఆంథెమ్‌.. లవర్‌బాయ్‌ లుక్‌లో ప్రభాస్‌ కనువిందు

సారాంశం

నేడు(సోమవారం) రెండో పాట `లవ్‌ ఆంథెమ్‌` గా సాగే `నగుమోము తారలే` అంటూ సాగే పాట టీజర్‌ని విడుదల చేశారు. జస్ట్ మ్యూజిక్‌తో సాగే ఈ సాంగ్‌ టీజర్‌ పాటపై హైప్‌ని, ఇంట్రెస్ట్ ని పెంచింది. విజువల్స్ మరింత కనువిందుగా ఉన్నాయి. 

ప్రభాస్‌(Prabhas), పూజా హెగ్డే(Pooja Hegde) నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ `రాధేశ్యామ్‌`(Radheshyam). ఫస్ట్ టైమ్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే కలిసి నటిస్తున్నారు. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమా రూపొందుతుంది. `జిల్‌` ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్‌, ప్రసీద(కృష్ణంరాజు కూతురు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్‌కి రెడీ అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేసింది. 

అభిమానుల కోరిక, డిమాండ్‌ మేరకు ఇటీవల సినిమా ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేశారు. `ఈ రాతలే` అంటూ సాగే పాట ప్రభాస్‌ ఫ్యాన్స్ ని, జనరల్‌ ఆడియెన్స్ ని, శ్రోతలను మెప్పించింది. యానిమేటెడ్‌ విజువల్స్ మరింతగా ఆకట్టుకున్నాయి. పైగా సినిమా కాన్సెప్ట్ ని తెలియజేసేలా ఆ పాట విజువల్స్ సాగడం మరింతగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మరో పాటని విడుదల చేయబోతుంది యూనిట్‌. అందులో భాగంగా నేడు(సోమవారం) రెండో పాట `లవ్‌ ఆంథెమ్‌` గా సాగే `నగుమోము తారలే`(Nagumomu Raatale) అంటూ సాగే పాట టీజర్‌ని విడుదల చేశారు. జస్ట్ మ్యూజిక్‌తో సాగే ఈ సాంగ్‌ టీజర్‌ పాటపై హైప్‌ని, ఇంట్రెస్ట్ ని పెంచింది. విజువల్స్ మరింత కనువిందుగా ఉన్నాయి. 

ఈరోజు మధ్యాహ్నం హిందీ వర్షెన్‌ సాంగ్‌ టీజర్‌ని విడుదల చేయగా, సాయంత్రం ఏడుగంటలకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం పాటల టీజర్లని విడుదల చేశారు. పూర్తి పాటని డిసెంబర్‌ 1న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఇందులో ప్రభాస్‌, పూజాహెగ్డే క్యూట్‌గా, అందంగా కనిపిస్తున్నారు. ప్రభాస్‌ నెవర్‌ బిఫోర్‌ అనేలా ఆయన లుక్‌ ఉండటం విశేషం. లవర్‌ బాయ్‌లా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఆయన ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నారు. జస్ట్ టీజరే ఇలా ఉంటే, పూర్తి పాట నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని అంటున్నారు అభిమానులు. 

ఈ విజువల్స్, టీజర్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. `సాహో` తర్వాత ప్రభాస్‌ నుంచి వస్తోన్న సినిమా కావడం, ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచడంతో `రాధేశ్యామ్‌` కోసం వరల్డ్ వైడ్‌గా ప్రభాస్‌ అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇక సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా, జనవరి 14న విడుదల చేయబోతున్నారు. 

also read: Poorna: విరహం తట్టుకోలేక ఢీ పూర్ణ హాట్‌ పోజులు.. సుధీర్‌తో చూసి ఆఫర్ ఇచ్చారట..బాలయ్యపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?