
దాదాపు మూడేళ్లు దాటుతోంది రాధేశ్యామ్(Radhe Shyam) మూవీ స్టార్ట్ అయ్యి.. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ నుంచి ప్రేమికుల రోజు కోసం స్పెషల్ అప్ డేట్ ఇవ్వబోతున్నారు.
ప్రభాస్ నుంచి లాంగ్ గ్యాప్ తరువాత వస్తున్న సినిమా రాధేశ్యామ్(Radhe Shyam). పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈమూవీతో రొమాంటిక్ హీరో అనిపించుకోవాలి అని చూస్తున్నాడు ప్రభాస్(Prabhas). ఇప్పటి వరకూ యాక్షన్ హీరోగా అదరగొట్టి యంగ్ రెబల్ స్టార్. ఇప్పుడు రొమాంటిక్ ఇమేజ్ కోసం చూస్తున్నాడు. రాధే శ్యామ్(Radhe Shyam)..టైటిల్ చూస్తేనే ఇది రొమాంటిక్ మూవీ అని అర్ధం అవుతుంది.
ఇక ఈసినిమా నుంచి మంచి అప్ డేట్ కోసం మంచి అకేషన్ రాబోతోంది. ఈనెల 14న వాలంటైన్స్ డే సందర్భంగా.. రాధేశ్యామ్(Radhe Shyam) నుంచి స్పెషల్ అప్ డేట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాధేవ్యామ్ మార్చి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. ఇక మళ్లీ ప్రమోషన్స్ కోసం టీమ్ రంగంలోకి దిగిపోయింది.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈ సినిమా నుంచి స్పెషల్ అప్ డేట్ రానున్నట్టు చెబుతున్నారు.ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా స్పెషల్ వీడియోలు వదలబోతున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈమూవీ నుంచి ఏదైనా సాంగ్ రిలీజ్ చేస్తారా? లేకపోతే రొమాంటిక్ టీజర్ వదులుతారా.. లేక పోస్టర్ తో సరిపెడతారా అనేది ఆసక్తికరంగా మారింది.
రోమన్ కాలంనాటి ప్రేమకథతోతెరకెక్కిన ఈసినిమాలో కృష్ణంరాజు, భాగ్యశ్రీ , జగపతిబాబు, సత్యరాజ్, మురళీశర్మ లాంటి స్టార్ కాస్ట్ సందడి చేయబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీని యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు.