Raveena Tandon: తండ్రికి తలకొరివి పెట్టిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్...

By Mahesh Jujjuri  |  First Published Feb 12, 2022, 10:54 AM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. సీనియర్ స్టార్ రవీనా టాండన్(Raveena Tandon) తండ్రి ప్రముఖ రచయిత మరణం బాలీవుడ్ లో విషాదఛాయలు నింపింది.  


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. సీనియర్ స్టార్ రవీనా టాండన్(Raveena Tandon) తండ్రి ప్రముఖ రచయిత మరణం బాలీవుడ్ లో విషాదఛాయలు నింపింది.  

రక్త సింధూరం, బంగారు బులోడు, ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులు సుపరిచితురాలు రవీనా టండన్(Raveena Tandon). ప్రస్తుంత ఆమె కెజియఫ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. హీరోయిన్ గా ఒక ఊపు ఊపిన రవీనా(Raveena Tandon).. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అదే ఊపు ను కొనసాగిస్తోంది.

Tap to resize

Latest Videos

ఇక  తాజాగా రవీనా తండ్రి, ప్రముఖ రచయిత, దర్శక నిర్మాత  రవి టాండన్ (Ravi Tandon) మరణించారు. కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న ఆయన.. 85 ఏళ్ల వయస్సులో తనువు చాలించారు. ఫిబ్రవరి 11న ముంబై హాస్పిటల్లో చికిత్స పొందుతూ రవి టండన్(Ravi Tandon)   మృతి చెందారు. రవి టాండన్ మృతి తో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.

undefined

 

ఆయన మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు తలుచుకుని బాధపడుతున్నారు. 1963లో సునీల్ దత్ నిర్మాణంలో యే రాస్తే హై ప్యార్ కే మూవీతో కెరీర్ ను ప్రారంభించారు రవి టాండన్ (Ravi Tandon). ఆ తర్వాత ఆయన పెద్ద హీరోలతో పని చేసారు. అంతే కాదు ఖేల్ ఖేల్ మే,అన్హోనీ లాంటి  చిన్న సినిమాలను  కూడా ఆయన తెరకెక్కించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Angel Jiya (@angeljiya15)

నజరానా, మజ్బూర్, ఖుద్-దార్, జిందగీ లాంటి హిట్ సినిమాలు చేసిన రవి టాండన్  మంచి ఫామ్‌లో ఉన్నపుడే కూతురు రవీనా టాండన్‌ను కూడా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం  అయ్యారు. రవి టాండన్(Ravi Tandon)  మరణంతోజజ. రవీనా టాండన్‌(Raveena Tandon)ను ప్రముఖులు పరామర్శించరు.  అంతే కాదు తండ్రి రవి టండన్ దహన సంస్కారాలను రవీనా టాండన్ పూర్తి చేసింది. తండ్రికి స్వయంగా తానే తలకొరివి పెట్టింది రవీనా.

 ఈ ఫోటోలతో పాటు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ వుతున్నాయి.ఇక తండ్రి రవి టండన్ (Ravi Tandon) మృతిపై రవీనా ఎమోషనల్ అయింది Raveena Tandon.ఈ మేరకు సోషల్ మీడియా లో ఓ లేఖను కూడా విడుదల చేసింది రవీనా. ప్రతి క్షణం నువ్వు నాతోనే ఉంటావు.. నన్ను నువ్వే దగ్గరుండి అడుగు వేయిస్తావ్ అంటూ నాన్నను తలచుకుని బాధపడింది రవీనాటండన్.  

click me!