సంక్రాంతి బరి నుంచి రీసెంట్ గా తప్పుకుంది ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ను లాక్ చేసిపెట్టుకున్నట్టు తెలుస్తోంది. మరి ఆ డేట్ టీమ్ కు వర్కౌట్ అవుతుందా..?
కరోనా వల్ల చాలా సినిమాల రిలీజ్ ను వాయిదా వేసుకొంటూ వస్తున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలన్నీ బ్యాక్ స్టెప్ వేస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకు ఇది తలనొప్పిగా మారింది. రీసెంట్ గా రాధేశ్యామ్(Radhe Shyam) రిలీజ్ కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు టీమ్. కాని కొత్త రిలీజ్ డేట్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు ఇదే రాధేశ్యామ్ కొత్త రిలీజ్ డేట్ అంటూ.. సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేస్తుంది.
యూనివర్సల్ స్టార్ ప్రభాస్(Prabhas )- పూజా హెగ్డే(Pooja Hegde) జంటగా.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కింది రాధేశ్యామ్(Radhe Shyam) మూవీ. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే మూడేళ్లకు పైగా టైమ్ తీసుకుంది సినిమా. కరోనా వల్ల డిలే అవుతూ వస్తోంది. ఇకనైనా రిలీజ్ చేస్తున్నారు అని ఫ్యాన్స్ ఖుషీ అవుతుంటే.. సడెన్ గా రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడం పెద్ద దెబ్బగా తగిలింది.
యూవీ క్రియేషన్స్ తో కలిసి గోపీ కృష్ణ మూవీస్ వారు Radhe Shyam ను దాదాపుగా 300 కోట్ల భారి బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) హస్త సాముద్రికం స్పెషలిస్ట్ గా కనిపించబోతున్నాడు. రోమన్ కాలం నాటి ప్రేమ కథతో.. తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేమించిన అమ్మాయి కోసం హీరో చేసే సాహసాలు సినిమాకు హైలెట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.
లాస్ట్ ఇయర్ దసరాకు రిలీజ్ అవుతుంది అనుకున్న రాధేశ్యామ్(Radhe Shyam) మూవీ ఎట్టకేలకు 2022 సంక్రాంతి అని తేల్చేశారు. దానికి తగ్గట్టు ప్రమోషన్స్ కూడ ప్లాన్ చేసుకున్నారు. ప్రమోషనల్ వీడియోస్ తో సినిమాపై హైప్ పెంచారు. ప్యాన్స్ కూడా సినిమా కోసం ఉవ్విళ్లూరుతున్న టైమ్ లో.. కరోనా కారణంగా సినిమాను వాయిదా వేశారు. థియేటర్లు మూతపడుతుండటం.. ఇతర కారణాల వ్లల రాధే శ్యామ్ పోస్ట్ పోన్ అయ్యింది.
Also Read :Ajith Valimai Postponed: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న అజిత్... వాలిమై రిలీజ్ ఎప్పుడు..?
అయితే ఈ సినిమా రిలీజ్ ఎపుడు ఉంటుంది అన్న అంశం పై ఇండస్ట్రీలో ఆసక్తి కర చర్చ జరుగుతుంది. కరోనా టైమ్ ఓ నెల రోజులే ఉంటుంది. ఆతరువాత అంతా నార్మల్ అవుతందుంది అన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్.. అందుకే రాధేశ్యామ్(Radhe Shyam) ను ఎక్కవ దూరం జరపకుండా.. ఓ నెల రెండునెలల తరువాత రిలీజ్ చేస్తే.. ఇప్పటి వరకూ ఉన్న బజ్ పోకూండా ఉంటుంది అనకుంటున్నారట టీమ్. మార్చ్ 18 ను రిలీజ్ డేట్ గా పరిశీలన లో ఉంచినట్టు తెలుస్తోంది. ఈ డేట్ ను లాక్ చేసి.. అప్పటి పరిస్థితులను బట్టి రిలీజ్ అనౌన్స్ మెంట్ ఇవ్వచ్చు అని చూస్తున్నారట రాధేశ్యామ్ టీమ్.
Also Rear : Rgv About Allu Arjun: అల్లు అర్జున్ ను ఆకాశానికెత్తిన రామ్ గోపాల్ వర్మ.. సడెన్ గా ఈ ప్రేమేంటి రాము..?