వరుసగా సినిమాలు వాయిదాల బాట పడుతున్నాయి. కరోనా థార్డ్ వేవ్ పుణ్యమా అని సినిమాలు వరుసగా డౌన్ అవుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలన్నీ పోస్ట్ పోన్ మత్రం జపిస్తున్నాయి. ఈ లిస్ట్ లోకి అజిత్ వాలిమై కూడా చేరింది.
వరుసగా సినిమాలు వాయిదాల బాట పడుతున్నాయి. కరోనా థార్డ్ వేవ్ పుణ్యమా అని సినిమా వరుసగా డౌన్ అవుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలన్నీ పోస్ట్ పోన్ మత్రం జపిస్తున్నాయి. ఈ లిస్ట్ లోకి అజిత్ వాలిమై కూడా చేరింది.
కరోనా కారణంగా వరుసగా సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా రేసు నుంచి తప్పుకుంటున్నాయి. టాలీవుడ్ నుంచి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలైన ట్రిపుల్ ఆర్(RRR), రాధేశ్యామ్(Radhe Shyam) ఇప్పటికే పోస్ట్ పోన్ అవ్వగా.. ఓ మోస్తరు సినిమాలు కూడా ఇప్పుడు వెనక్కు తగ్గుతున్నాయి. అందలో కోలీవుడ్ మూవీ వాలిమై కూడా చేరింది.
కోలీవుడ్ లో అజిత్(Ajith) వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. అజిత్ సినిమా అంటే పిచ్చ క్రేజ్ ఉంటుంది తమిళంలో. ఇక అజిత్ హీరోగా వినోద్ డైరెక్షన్ లో.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోణీ కపూర్(Boni Kapoor) నిర్మించిన సినిమా వాలిమై. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ మూవీని ఈ నెల 13న రిలీజ్ చేస్తామంటూ ముందుగా అనౌన్స్ చేశారు టీమ్. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసేశారు. కాని పరిస్థితులు రాను రాను మారుతూ వస్తుండటంతో.. వాలిమై రిలీజ్ పై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
తెలుగులో బలం టైటిల్ తో ఈ సినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాని ఎందుకో ఆ టైటిల్ సెట్ అవ్వదు అనుకున్నారో ఏమో.. ఆలోచన మార్చుకుని వాలిమై(Valimai) పేరుతోనే పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇది ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఈ షాక్ లో ఉండగానే వాలిమై రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు టీమ్. ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
ఇప్పటికే కరోనా అన్ని రాష్టాలను కంగారు పెడుతుంది. తమిళనాడులో ముందుగానే స్పందించిన ప్రభుత్వం థియేటర్స్ లో.. 50 శాతం ఆక్యూపెన్సీని ప్రకటించింది. ఇప్పుడు కేసులు మరింత పెరగడం.. ఒమిక్రాన్ భయంతో.. కోలీవుడ్ లో థియటర్లు మూసివేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేయక తప్పలేదు మేకర్స్ కి. ఇటు టాలీవుడ్ లో కూడా సంక్రాంతికి చాలా సినిమాలు బరిలో ఉన్నాయి. మరి అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
ఇక అజిత్ వాలిమై మూవీ కోసం చాలా కష్ట పడ్డాడు. బైక్ రేస్ ల తో స్టంట్స్ చేశాడు. ఈ సినిమాలో అజిత్ కు స్ట్రాంగ్ ఆపోజిట్ క్యారెక్టర్ లో టాలివుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించారు. టాలీవుడ్ లో హీరోగా వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్న కార్తికేయ.. వాలిమై హిట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
Also Read : కుర్ర హీరోలతో రొమాన్స్ కు రెడీ అవుతున్న సీనియర్ స్టార్ హీరోయిన్లు..