ఒకే బెడ్‌పై ముగ్గురు మెగా హీరోలు.. వెకేషన్‌ వైబ్స్

Published : Jun 27, 2021, 03:21 PM IST
ఒకే బెడ్‌పై ముగ్గురు మెగా హీరోలు.. వెకేషన్‌ వైబ్స్

సారాంశం

వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ ఇప్పుడీ ముగ్గురు మెగా హీరోలు ఒకే బెడ్‌పై కనిపించి షాక్‌ ఇచ్చారు. అంతేకాదు ముగ్గురూ పడుకుని ఉన్నారు.

వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ ఇప్పుడీ ముగ్గురు మెగా హీరోలు ఒకే బెడ్‌పై కనిపించి షాక్‌ ఇచ్చారు. అంతేకాదు ముగ్గురూ పడుకుని ఉన్నారు. వైష్ణవ్‌ తేజ్‌ ఏకంగా డ్రెస్‌ తీసేసి పర్పుపై హాయిగా నిద్ర పోతున్నాడు, వరుణ్‌ తేజ్‌ కొంటెగా కన్నుగొడుతున్నాడు. ఇక సాయిధరమ్‌ తేజ్‌ నిద్ర పోతున్నట్టుగా నటిస్తూ సెల్ఫీ తీశాడు. తాజాగా ఈ ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారీ హీరోలు. వెకేషన్‌ వైబ్స్‌ అంటూ ఈ పిక్‌ని పంచుకోగా, అది సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. 

ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ `గని`, `ఎఫ్‌3` చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు సాయితేజ్‌ `రిపబ్లిక్‌` చిత్రం విడుదలకు రెడీగా ఉంది. మరో కొత్త సినిమాని ఇటీవలే ప్రారంభించాడు. ఇక `ఉప్పెన`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకుని గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్‌ తేజ్‌.. క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు ఈ మధ్యే మరో కొత్త సినిమాని లాంచ్‌ చేశాడు. ఇలా తలోరెండు సినిమాలతో ఈ ముగ్గురు మెగా హీరోలు బిజీగా ఉన్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే
రష్మిక మందన్న, రణ్ వీర్ సింగ్, రిషబ్ శెట్టితో పాటు, 2025లో బెస్ట్ యాక్టర్స్ ఎవరో తెలుసా?