
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే (Pooja Hegde)జంటగా రాధా కృష్ణ కుమారి తెరకెక్కించిన ఇండియా లవ్ స్టోరీ రాధే శ్యామ్ (Radhe Shyam) అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇండియాలో మొదటి సారి ఒక ప్రేమకథకు ఈ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురుస్తుంది. మూడు రోజుల్లోనే 151 కోట్ల గ్రాస్ వసూలు చేసింది రాధే శ్యామ్. పాజిటివ్ మౌత్ టాక్ తో థియేటర్లకు ప్రేక్షకులు కదులుతున్నారు. భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఈ సినిమాకు అనూహ్యమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రభాస్జ్ పూజా హెగ్డే కెమిస్ట్రీకి అందరూ ఫీలవుతున్నారు. అలాగే రాధా కృష్ణ కుమార్ టేకింగ్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణ. ఇప్పటికే నిర్మాతలకు బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఈ సినిమా.
సినిమాకు పెట్టిన ఖర్చుకు.. చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ కు.. ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ కు.. నిర్మాతలు ఇప్పటికే సేఫ్ అయిపోయారు. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రాధే శ్యామ్ రికార్డ్ క్రియేట్ చేసింది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఆల్ టైం రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. ఇక ఇప్పుడు థియేటర్లలో కూడా సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు రోజుల్లో అన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. ఒక ప్రేమ కథకు ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుండడం ఇదే మొదటిసారి. ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ రాధే శ్యామ్ సినిమా మరోసారి నిరూపించింది. అత్యద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్.. ఎమోషనల్ గా సాగే లవ్ స్టోరీ.. కట్టి పడేసే క్లైమాక్స్ సన్నివేశాలు రాధే శ్యామ్ సినిమాకు పాజిటివ్ గా నిలిచాయి.
పస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న రాధే శ్యామ్ తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. హిందీలో మాత్రం యావరేజ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ మొదటి రోజు ఏపీ, తెలంగాణలో రూ. 25.49 కోట్లు, 2వ రోజు రూ. 12.32 కోట్లు, మూడవ రోజు రూ. 10.58 కోట్లు, మొత్తంగా 48.39 కోట్లు (రూ.75.20 కోట్ల గ్రాస్) వసూల్ చేసింది. ఇక మూడో రోజు రాధే శ్యామ్ ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు ఇలాల... ఉన్నాయి.
నైజాం: 4.90 కోట్లు
సీడెడ్: 1.61కోట్లు
యూఏ : 1.07కోట్లు
తూర్పు : 66 లక్షలు
పశ్చిమ: 51 లక్షలు
గుంటూరు: 76 లక్షలు
కృష్ణ: 68లక్షలు
నెల్లూరు: 39లక్షలు
AP-TG మొత్తం:- 10.58CR(18CR~ గ్రాస్) కలెక్షన్స్ సాధించింది. మొత్తం మూడో రోజు పూర్తయ్యే సరికి రాధే శ్యామ్ ప్రపంచ వ్యాప్తంగా రూ.151 కోట్ల గ్రాస్ కలెక్ట చేసింది. 2022లో బిగ్గేస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా నిలిచిందీ రాధే శ్యామ్. బహుబలి, సాహో తర్వాత, రాధే శ్యామ్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.