
ప్రభాస్(Prabhas), పూజా హెగ్డే(Pooja Hegde) జంటగా నటించిన పీరియాడికల్ లవ్ స్టోరీ `రాధేశ్యామ్`(Radheshyam). రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీ మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తున్నా, విజువల్ వండర్ గా అన్ని వర్గాలను కనువిందు చేస్తుంది. ‘డార్లింగ్’ మూవీ తర్వాత ప్యూర్ లవ్ స్టోరీని వీక్షిస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తొలిరోజు వరల్డ్ వైడ్‌గా భారీ కలెక్షన్లను (Radheshyam Collections) రాబట్టింది. రూ.79 కోట్లు వసూల్ చేసి బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.
కాగా రెండో రోజు కూడా అదే జోరును చూపించింది రాధే శ్యామ్. తాజా రిపోర్ట్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ ర్యాంపేజ్ రూ.119 కోట్ల గ్రాస్ ను రీచ్ అయ్యింది. రెండు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లు రావడం విశేషం. మూవీ మిశ్రమ స్పందనను పొందినా.. వసూళ్లలో ఏ మాత్రం తగ్గడం లేదు. `పుష్ప` మాదిరిగానే `రాధేశ్యామ్` మున్ముందు సంచలనాలు క్రియేట్ చేయనుంది.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ నటించిన ‘బహుబలి’, సాహో హైహెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా చోటు దక్కించుకున్నాయి. బహుబలి రూ.1000 కోట్ల గ్రాస్ రీచ్ కాగా, సాహో రూ.600 కోట్లకు పైగా రీచ్ అయ్యింది. ఆ తర్వాతి స్థానంలో ‘పుష్ప’ నిలిచింది. రెండురోజుల్లోనే సాహో వంద కోట్ల మార్క్ ను దాటి షాక్ కు గురిచేస్తోంది. హాలీవుడ్ సినిమాలతో పోటీపడి మరీ అద్భుతమైన వసూళ్లని రాబడుతుందని దర్శకుడు రాధాకృష్ణ తెలిపారు. ఏపీ, తెలంగాణలో మూడో రోజు కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తోంది.