Sebastian Ott Release: రెండు వారాలకే ఓటీటీ గుమ్మం తొక్కబోతున్న సెబాస్టియన్ మూవీ... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Published : Mar 13, 2022, 01:26 PM IST
Sebastian Ott Release: రెండు వారాలకే ఓటీటీ గుమ్మం తొక్కబోతున్న సెబాస్టియన్ మూవీ... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

సారాంశం

థియేటర్ రిలీజ్ అయిన రెండు వారాలకే డిజిటల్ ప్లాట్ ఫామ్ కి కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ మూవీ. రెండు సినిమాలు హిట్ కొట్టిన కిరణ్ కు సెబాస్టియన్ నిరాశపరిచింది. 

రాజావారు రాణివారు.. ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాలతో ఆకట్టుకున్నయంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆయన నటించిన రీసెంట్ మూవీ సెబాస్టయిన్. అయితే ఎస్ఆర్ కళ్యాణమండపం  సినిమాలాగే సెబాస్టియన్ సినిమా ట్రైలర్ కూడా  ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. దాంతో ఈ సినిమా బాగా వర్కవుట్ అవుతుందని ఆశలు పెట్టుకున్నారు. కాని ఈనెల 4న రిలీజ్ అయిన సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకేలకపోయింది.

 హ్యాట్రిక్ హిట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కిరణ్ అబ్బవరానికి ఈ సినిమా చాలా డిస్సపాయింట్ చేసిందనే చెప్పాలి. రేచీకటి సమస్య ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ నైట్ డ్యూటీ చేస్తే జరిగే పరిణామాల నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు. పాయింట్ గా బాగున్నా స్క్రిప్టు సరిగ్గా రాయకపోవటంతో సినిమా బాగోలేదు. హీరోగా కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్ అందుకోలేక చతికిలపడ్డాడు.  

ఇక రిలీజ్ అయిన రెండు వారాలలోనే ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎక్కించబోతున్నారు. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా లో మార్చి 18 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. బాలాజీ స‌య్య‌పురెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో నవేక్ష హీరోయిన్‌గా న‌టించింది. అయితే ఎప్పటిలాగానే కిరణ్ పర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Gift: `ఓజీ` దర్శకుడికి పవన్‌ కళ్యాణ్‌ ఊహించని గిఫ్ట్.. సుజీత్‌ ఎమోషనల్‌
9 సినిమాలు చేస్తే.. అందులో 8 ఫ్లాప్‌లు.. పాన్ ఇండియా స్టార్‌పైనే ఆశలన్నీ.. ఎవరీ హీరోయిన్.?