తేజుతో రాశి ఖన్నా మరోసారి.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా!

Published : Jun 19, 2019, 06:50 PM IST
తేజుతో రాశి ఖన్నా మరోసారి.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా!

సారాంశం

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆరు వరుస పరాజయాల తర్వాత సక్సెస్ అందుకున్నాడు. ఈ ఏడాది విడుదలైన చిత్రలహరి చిత్రం విజయం సాధించింది. 

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆరు వరుస పరాజయాల తర్వాత సక్సెస్ అందుకున్నాడు. ఈ ఏడాది విడుదలైన చిత్రలహరి చిత్రం విజయం సాధించింది. దీనితో తేజుకు అవసరమైన బ్రేక్ లభించింది. కెరీర్ ఆరంభంలో సుప్రీం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో టాప్ లీగ్ లోకి వచ్చేలా తేజు కనిపించాడు. కానీ ఆ తర్వాత ఎదురైన ప్లాప్ చిత్రాలతో తేజు జోరు తగ్గింది. 

ఇదిలా ఉండగా చిత్రలహరి చిత్రం తర్వాత సాయిధరమ్ తేజ్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. త్వరలో తేజు మారుతి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రంలో తేజు సరసన నటించే హీరోయిన్ల కోసం వేట కొనసాగుతోంది. తాజాగా దర్శకుడు మారుతి రాశి ఖన్నా పేరు పరిశీలిస్తున్నారట. 

రాశి ఖన్నా, తేజులది సూపర్ హిట్ జోడి. వీరిద్దరూ కలసి నటించిన సుప్రీం చిత్రం ఘనవిజయం సాధించింది. తేజు, రాశి ఖన్నా మధ్య కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ కాంబినేషన్ కుదిరితే సినిమాపై సుప్రీం తరహాలో అంచనాలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు రుక్సార్ థిల్లోన్ పేరు కూడా వినిపిస్తోంది. రుక్సార్ థిల్లోన్ ఎబిసిడి చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై పూర్తి క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే. 

 

PREV
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం