గబ్బర్ సింగ్ గడ్డం తీశాడు.. కొత్త లుక్ అదిరిందిగా!

Published : Jun 19, 2019, 05:52 PM IST
గబ్బర్ సింగ్ గడ్డం తీశాడు.. కొత్త లుక్ అదిరిందిగా!

సారాంశం

ఇటీవల ఎన్నికల ఫలితాలు జనసేన పార్టీకి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. జనసేనకు కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది.

ఇటీవల ఎన్నికల ఫలితాలు జనసేన పార్టీకి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. జనసేనకు కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది. దీనితో పవన్ కళ్యాణ్ తదుపరి రాజకీయ అడుగులు ఏంటనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటించబోతున్నారంటూ కొన్ని రూమర్లు కూడా వినిపించాయి. కానీ పవన్ కళ్యాణ్ పాతికేళ్ళపాటు రాజకీయాల్లోనే కొనసాగుతానని ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా ఎన్నిల తర్వాత నిన్నమొన్నటి వరకు పవన్ ఎక్కువగా పెరిగిన గడ్డంతో కనిపించారు. తాజాగా పవన్ కళ్యాణ్ గడ్డం ట్రిమ్ చేసి స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. 

ఓ చిన్నారిని కలసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రిమ్ చేసిన తర్వాత పవన్ లుక్ ఫ్రెష్ గా అనిపిస్తోంది. కలర్ ఫుల్ డ్రెస్ తో, పక్కనే ఓ చిన్నారి కూడా ఉండడం నెటిజన్లని ఆకర్షిస్తోంది. ఏది ఏమైనా పవన్ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ఆయన తీసుకోబోయే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

Indian Actresses: పిల్లలను దత్తత తీసుకుని తల్లులుగా మారిన హీరోయిన్లు
Maruthi: దర్శకుడు మారుతికి ప్రభాస్‌ అభిమానులు ఝలక్‌, వందకుపైగా ఫుడ్‌ ఆర్డర్స్.. ది రాజాసాబ్‌ డిజాస్టర్‌ దెబ్బ