Raajadhani Files : ‘ముగ్గురు అమ్మలు.. ముగ్గురు నాన్నలు’ అంటూ... మూడు రాజధానులపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

By Nuthi SrikanthFirst Published Feb 15, 2024, 10:18 AM IST
Highlights

‘రాజధాని ఫైల్స్’ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఏపీలోని అమరావతి రైతులు రాజధానుల పోరాటం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే తాజాగా.. మూడు క్యాపిటల్స్ పై తాజాగా దర్శకుడు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 

ఏపీలోని అమరావతినే రాజధాని చేయాలంటూ రైతులు కొన్నేళ్లుగా ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ వారు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల వెర్షన్ లో ‘రాజధాని ఫైల్స్’ Raajadhani Files అనే చిత్రం రూపుదిద్దుకుంది. ఈరోజు (Feb 15) ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. భాను ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అఖిలన్ (పరిచయం), వీణ (పరిచయం), వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్, పవన్, విశాల్ పట్నీ, షణ్ముఖ్, మధు, అజయరత్నం, అమృత చౌదరి, అంకితా ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ సంగీతం అందించడం విశేషం. 

 ఫిబ్ర‌వ‌రి 15, 2024న థియేట‌ర్ల‌ (ఈరోజు) ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే నిన్నే డిస్ట్రిబ్యూట‌ర్లు, మ‌రికొంద‌రు సినీ ప్ర‌ముఖుల‌కి ప్ర‌త్యేక ప్రీమియ‌ర్స్‌ వేయడం కూడా జరిగింది. అమరావతి రైతుల కష్టాలను వాస్తవికంగా చిత్రీకరించినందుకు ప్రశంసలు అందుకుంటున్నారు దర్శకుడు. సెన్సిటివ్ ఇష్యూతో ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా విజ‌యం సాధిస్తుంద‌ని భావిస్తున్నారు. అయితే ఈ చిత్ర విడుదలకు ముందుకు జరిగిన ప్రెస్ మీట్ లో దర్శకుడి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఒక్కడి అహంతోనే మొత్తం రాజధాని నాశమైంది.. ఎందుకనేది సినిమాలో చెప్పాను. ఒక్క రాజధాని ఉంటే ఏంటీ.. మూడు రాజధానులు ఉంటే నష్టమేంటనేది క్లియర్ గా చెప్పాం.  ముగ్గురు నాన్నలు, ముగ్గురు అమ్మలు ఉంటే ఎలా ఉంటుంది. ఏ నాన్న దగ్గరికి వెళ్లాలి.. ఏ అమ్మ దగ్గర పడుకోవాలనేది సందేహంగా మారుతుంది. నేను కేవలం అమరావతి రైతుల నష్టాన్ని చూపించే ప్రయత్నమే చేశాను. వాళ్ల కష్టాన్ని నేను నేరుగా చూశాను. అదే విషయాన్ని సామాజిక బాధ్యతతో సినిమా తీశాను. నరేంద్ర మోడీ కూడా ఈ సినిమా చూసి ప్రశంసించే స్థాయిలో ఉంటుంది. నేను ఎవరికో సపోర్ట్ చేసేలా సినిమా తీయలేదు... రైతులను ఓదార్చే వారు లేకనే వారు చేస్తున్న పోరాటాన్ని చూపించాను.’ అని చెప్పుకొచ్చారు.  

click me!