'మీటూ' పనైపోయింది.. రాయ్ లక్ష్మీ కామెంట్స్!

By Udaya DFirst Published 19, Feb 2019, 3:49 PM IST
Highlights

మీటూ ఉద్యమం పనైపోయిందని, దాని గురించి మాట్లాడనని అంటోంది నటి రాయ్ లక్ష్మీ. ముగిసిపోయిన వ్యవహారం గురించి మాట్లాడుకోవడం వృధా అని చెబుతోంది. 

మీటూ ఉద్యమం పనైపోయిందని, దాని గురించి మాట్లాడనని అంటోంది నటి రాయ్ లక్ష్మీ. ముగిసిపోయిన వ్యవహారం గురించి మాట్లాడుకోవడం వృధా అని చెబుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకి కాస్టింగ్ కౌచ్, మీటూ వంటి వ్యవహారాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. 

మీటూ ఉద్యమం ముగిసిపోయిందని, ఏదో జరుగుతుందని సంబరపడ్డాను కానీ ఏదీ జరగలేదని అన్నారు. కొంతమంది అమ్మాయిలు నిజాయితీగా బయటకొచ్చినా.. ఈ ఉద్యమం పక్కదారి పట్టిందని, క్రమక్రమంగా వ్యక్తిగత కక్షగా మారిపోయిందని తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

ప్రస్తుతం నడుస్తున్న మీటూ ఉద్యమానికి తను ఎలాంటి సపోర్ట్ ఇవ్వనని ప్రకటించింది రాయ్ లక్ష్మీ. అసలు నిజమేంటో తెలియనప్పుడు మద్దతు ఎలా ఇస్తామని ప్రశ్నించింది. మరిన్ని విషయాలను చెబుతూ.. ''నాకు బ్రేక్ ఇవ్వకపోతే నీ గురించి చెడుగా మాట్లాడతా అనేంతవరకు వెళ్లిపోయింది.

ఈ ఉద్యమాన్ని నేను సపోర్ట్ చేయాలనుకోవడం లేదు. సౌత్ కి సంబంధించినంత వరకు నేను కొన్ని మీటూ స్టోరీలు విన్నాను.. అవి అబద్దాలని నేను చెప్పను అలా అని నిజాలు కూడా కావు'' అంటూ చెప్పుకొచ్చింది. 

Last Updated 19, Feb 2019, 3:49 PM IST