బీచ్ లో రాయ్ లక్ష్మీ మళ్లీ ఎలా రెచ్చిపోయిందంటే...

Published : Feb 08, 2018, 04:38 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
బీచ్ లో రాయ్ లక్ష్మీ మళ్లీ ఎలా రెచ్చిపోయిందంటే...

సారాంశం

రత్తాలు పాటతో తెలుగులో రీసెంట్ గా ఫేమస్ గా మారిన రాయ్ లక్ష్మి బాలీవుడ్ లో జూలీ2 దెబ్బతో మళ్లీ రెచ్చిపోయిన రాయ్ లక్ష్మి బికినీ అందాలు పోస్ట్ చేసి హీటెక్కిస్తున్న రత్తాలు  

బాలీవుడ్ లాంటి చోట అవకాశాలు రావాలంటే... కూసింత గ్లామర్ ప్రదర్శన చేయాల్సిందేనన్న లాజిక్ పట్టేశారు మన అందాల భామలు. ఆఫర్లు లేని కొందరు భామలు పనిగట్టుకొని ఫారిన్ టూర్లు వెళ్ళో.. లేదంటే కనీసం గోవాకో వెళ్లి..  తమ బికినీ అందాల ప్రదర్శనకు రిబ్బన్ కట్ చేస్తున్నారు. కొందరైతే ఆల్రెడీ ఓపెన్ చేసిన ఎకౌంట్ ఆనక... మళ్లీ మళ్లీ అందాలు ఆరబోస్తుంటారు.
 

గతేడాది ఖైదీ నెం 150 సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సరసన రత్తాలు రత్తాలు సాంగ్ చేసి మళ్లీ వచ్చింది రాయ్ లక్ష్మి. అయితే ఆ తరువాత తెలుగులో ఈమెకు మతిపోయే ఆఫర్లు రాలేదు కాని బాలీవుడ్ లో మాత్రం ''జూలీ 2'' సినిమా చేసే ఛాన్సొచ్చింది. అయితే ఆ సినిమా రిలీజయ్యేవరకు రోజూ ఈ సుందరి తన సోషల్ మీడియా ఖాతాలో ఏదో ఒక సెక్సీ ఫోటో పెడుతూ కుర్రాళ్లలో జోష్ నింపింది. బీచుల్లో సందడి చేస్తూ అక్కడి నుండి హాయ్ చెబుతూ.. సందడి  చేసింది. అలాంటి పాత ఫోటో ఒకటి ఇప్పుడు మళ్లీ షేర్ చేసి.. హేయ్ నన్ను చూశారా అంటోంది. 
 

నిజానికి జూలి 2 సినిమా హిట్టయ్యింటే పరిస్థితి వేరేలా ఉండేది. కాని ఆ సినిమాలో ఈమె అర్ధనగ్న ప్రదర్శనలు తప్పించి చెప్పుకోటానికి మరేమీ లేకపోవడంతో.. సినిమాకు పెద్దగా ప్లస్సవ్వలేదు. అలాగే ఆ సినిమా కూడా ఈమెకు ప్లస్సవ్వలేదు. అందుకే ఇప్పుడు రత్తాలు మరోసారి బికినీ ఫోటోలతో రచ్చ చేయడం మొదలెట్టింది.

 

PREV
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌