R Narayana Murthy : నంది అవార్డులపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆర్ నారాయణ మూర్తి రిక్వెస్ట్...

Published : Feb 10, 2022, 05:04 PM IST
R Narayana Murthy : నంది అవార్డులపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆర్ నారాయణ మూర్తి రిక్వెస్ట్...

సారాంశం

కొన్నేండ్లుగా పత్తాజాడ లేని ‘నంది’ అవార్డుల గురించి నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేశాడు. ఏపీ సీఎం జగన్ ను టాలీవుడ్ హీరోలు, ప్రముఖులు కలిసిన సందర్భంగా విజ్ఞప్తి చేశారు.   

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్(CM Jagan) తో సినీ ప్రముఖుల చర్చలు ముగిశాయి. చిరంజీవి నేతృత్వంలోని బృందం నేడు ఏపీ సీఎం ని కలిశారు. మహేష్(Mahesh babu), ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, అలీ, పోసాని, ఆర్ నారాయణమూర్తి జగన్ కలిశారు.  దాదాపు  గంటకు పైగా సీఎం జగన్ తో చిత్ర ప్రముఖులు చర్చలు జరిపారు. 

సినిమా టికెట్స్ ధరలు, బెనిఫిట్ షోలకు అనుమతి, సరళతరమైన థియేటర్స్ నిబంధనలు, నంది అవార్డ్స్ వంటి  పలు కీలక విషయాలు చర్చకు వచ్చాయి. అలాగే ప్రభుత్వం తరపు నుండి కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. వైజాగ్ వేదికగా చిత్ర పరిశ్రమ అభివృద్ధి,చిన్న చిత్రాల మనుగడకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పరిశ్రమ ప్రముఖులను సీఎం జగన్ కోరారు. 

అయితే ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని, మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు మాట్లాడారు. సానుకూలంగా స్పందించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్  నారాయణ మూర్తి కూడా మాట్లాడుతూ  చిన్న సినిమా మనుగడ పెద్ద సినిమాల వలన ప్రశ్నార్ధకం అవుతుంద్నారు. ఇలాంటి మీటింగ్ కి ఫిలిం ఛాంబర్ సభ్యులను కూడా ఆహ్వానిస్తే పరిపూర్ణంగా ఉంటుందంటూ కోరారు. కోవిడ్ నిబంధనలు అంటూ చిరంజీవి, పేర్ని నాని ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా నారాయణ మూర్తి ఒప్పుకోలేదు. 

అలాగే కొన్నేండ్ల నుంచి నటీనటులకు ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించడం లేదన్నారు. సినిమా టికెట్ల ధరపైన పోరాడినట్లే మెగా స్టార్ చిరంజీవి ఈ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అయితే 1964 నుంచి నంది అవార్డుల ప్రదాన కార్యక్రమం క్రమం తప్పకుండా  నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా రెండేండ్లు అవార్డులను ప్రదానం చేశారు. 2015, 2016లోనూ అందించారు. కానీ 2017 నుంచి నంది అవార్డులను ప్రదానం చేయలేదు.  

అయితే గతంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సెంట్రల్ నుంచి అందాల్సిన అవార్డులు కూడా సరిగా అందడం లేదని పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. అవార్డుల ప్రదానంతో నటీనటుల్లో ఉత్సాహం పెరుగుతుందని, వారి స్థాయి, గౌరవం  కూడా పెరిగే అవకాశం ఉన్నందున నంది అవార్డులను  ప్రకటించే కార్యక్రమాన్ని పున:ప్రారంభించాలని సినీ ప్రముఖులు కోరుతున్నారు. అలాగే కైకాల సత్యనారాయణ వంటి వాళ్లకు దక్కాల్సిన పురస్కరాలను కూడా అందించాలని సూచిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం