
‘బూబన్ బద్యాకర్’ పాడిన పాట రీమిక్స్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ సాంగ్ కు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కూడా చిందులేశారు. మరోవైపు ఈ సాంగ్ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది.
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని బీర్బమ్ జిల్లా లక్ష్మీ నారాయణ్ పూర్ పంచాయతీలోని దుబ్రజ్ పూర్ కాలనీకి చెందిన ‘బూబన్ బద్యాకర్’ పల్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే పల్లీలు అమ్మేందుకు బూబన్ బద్యాకర్ తానే స్వయంగా ఒక పాటను క్రియేట్ చేసి పాడుతున్నాడు. ‘మీ దగ్గర బంగారపు చైన్లు, గొలుసులు ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి. అంతకు సమానమైన పల్లీలను మీరు తీసుకెళ్లండి. వేయించని పల్లీలు.. (కచ్చా బదాం).. నేను వీటిని వేయించలేదు. తియ్యగా ఉంటాయి..’ అంటూ బద్యాకర్ లిరిక్స్ రాసుకున్నాడు. ఈ పాటను విన్న ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.
అయితే ‘పుష్ప’ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ ‘కచ్చా బాదమ్’కి డ్యాన్స్ చేసి బన్నీకి ఆనందం కలిగించింది. ఆమె పాట పాడుతూ డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. అర్హ గురించి ప్రతి విషయాన్ని పంచుకునే బన్నీ, తాజాగా ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
అదేవిధంగా ‘పుష్ప’ మేకర్ అల్లు అర్జున్ పుష్ప రాజ్‌గా మారే మేకప్ వీడియోను విడుదల చేశారు. వీడియోలో అల్లు అర్జున్ తన వ్యానిటీ వ్యాన్‌లో ఓపికగా కూర్చోవడం కనిపిస్తుంది. అతని చుట్టూ హెయిర్‌స్టైలిస్ట్‌లు మరియు మేకప్ నిపుణులు అతని రూపానికి తుది మెరుగులు దిద్దుతుంటారు. బన్నీ ఫ్యాన్స్ ఈ వీడియోను కూడా తెగ వైరల్ చేస్తున్నారు.