నాకెలాంటి ఆర్ధిక కష్టాలు లేవు.. అవాస్తవాలు రాయకండి : ఆర్ నారాయణ మూర్తి

Siva Kodati |  
Published : Jul 15, 2021, 03:47 PM IST
నాకెలాంటి ఆర్ధిక కష్టాలు లేవు.. అవాస్తవాలు రాయకండి : ఆర్ నారాయణ మూర్తి

సారాంశం

తనకి పల్లెటూరి వాతావరణంలో ఉండటం ఇష్టం కాబట్టే హైదరాబాద్ కి దూరంగా ఉంటున్నాని అంతేకాకుండా తనకి ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేవని నారాయణ మూర్తి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం అవాస్తవాలను రాయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 

తనపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించారు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్ చేసిన కొన్ని వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వక్రీకరించారని ఆయన వెల్లడించారు. తను ఇంటి అద్దె కూడా కట్టని పరిస్థితుల్లో ఉన్నానని, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నట్టు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో రావడం పూర్తిగా అవాస్తవాలని అన్నారు. తనకి పల్లెటూరి వాతావరణంలో ఉండటం ఇష్టం కాబట్టే హైదరాబాద్ కి దూరంగా ఉంటున్నాని అంతేకాకుండా తనకి ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేవని నారాయణ మూర్తి స్పష్టం చేశారు.

ప్రస్తుతం తనకి సరిపడా సంపాదించుకొన్నానని అందులో నుండి అవసరం ఉన్నంత వరకే సేవా కార్యక్రమాలు చేయడానికి ఖర్చు చేస్తానని ఆయన తెలిపారు. ఎన్ని డబ్బులు ఉన్నా తనకి సాధారణ జీవితం అంటేనే ఇష్టమని, హంగులు ఆర్భాటాలు తనకి ఇష్టముండదని నారాయణ మూర్తి చెప్పారు. తనకి బయటి దేశాల నుండి ఎంతో మంది అభిమానులు తాను బాధల్లో ఉన్నానని అవాస్తవాలు విని తనకి ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పడం కన్నీళ్ళు తెప్పించాయని ఆర్ నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం అవాస్తవాలను రాయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Niharika: చిరంజీవి డ్రీమ్ ని ఫుల్‌ ఫిల్‌ చేసిన నిహారికా.. ఏం చేసిందంటే
400 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే