అలియా-రన్బీర్ పెళ్లి, తరువాత విడాకులు...!

By team teluguFirst Published Jul 15, 2021, 3:00 PM IST
Highlights

కమల్ ఆర్ ఖాన్ ప్రెడిక్షన్స్ పేరుతో బాలీవుడ్ సెలెబ్రిటీలపై వివాదాస్పద ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా అలియా భట్, రన్బీర్ కపూర్ పెళ్లి, విడాకులు అంటూ ట్వీట్స్ తో వేడి రాజేశారు. 

బాలీవుడ్ వివాదాస్పద ఫిలిం క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కే ఆర్ కే సోషల్ మీడియా స్టేట్మెంట్స్, కామెంట్స్ కాంట్రవర్సీ కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉంటాయి. బాలీవుడ్ లోని కొందరు పెద్దలను ఉద్దేశిస్తూ ఆయన చేసిన ట్వీట్స్ వివాదాలకు కారణం అయ్యాయి. కమల్ ఆర్ ఖాన్ దారుణమైన ట్వీట్స్ నేపథ్యంలో ట్విట్టర్ నుండి ఓ మారు బహిష్కరించబడ్డారు. కాగా ఈ మధ్య అతడు జోస్యం చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. 


ప్రెడిక్షన్స్ పేరుతో బాలీవుడ్ సెలెబ్రిటీలపై వివాదాస్పద ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా అలియా భట్, రన్బీర్ కపూర్ పెళ్లి, విడాకులు అంటూ ట్వీట్స్ తో వేడి రాజేశారు. తన అంచనా ప్రకారం 2022 చివర్లో అలియా, రన్బీర్ వివాహం చేసుకుంటారని, ఆ తరువాత ఓ 15ఏళ్లకు విడాకులు తీసుకొని విడిపోతారని ట్వీట్ చేశారు. కమల్ ఆర్ ఖాన్ చేసిన ఈ ట్వీట్ వైరల్ కావడం జరిగింది. 


కొన్నాళ్లుగా అలియా, రన్బీర్ డేటింగ్ చేస్తున్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని వార్తలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ కూడా విడాకులు తీసుకుంటారు అంటూ జోస్యం చెప్పాడు కమల్ ఆర్ ఖాన్. ఇక టబు ఎప్పటికీ పెళ్లి చేసుకోరు అంటూ మరో ట్వీట్ చేశారు. 


సల్మాన్ ఖాన్ ని విమర్శిస్తూ వరుస ట్వీట్స్ చేస్తూ ఉండే కమల్ ఆర్ ఖాన్ పై ఆయన పరువు నష్టం దావా వేశారు. రాధే మూవీని ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్ ఆధారంగా కమల్ ఆర్ ఖాన్ కి పరువు నష్టం దావా నోటీసులు పంపారు. 

Prediction 08- Ranbir Kapoor and Alia Bhatt will get married max till end of 2022. But Ranbir Kapoor will divorce her within 15 years after marriage!

— KRK (@kamaalrkhan)
click me!