క్యూనెట్ కేసులో మరోసారి సెలబ్రిటీలకు నోటీసులు!

Published : Aug 02, 2019, 12:18 PM IST
క్యూనెట్ కేసులో మరోసారి సెలబ్రిటీలకు నోటీసులు!

సారాంశం

క్యూనెట్ కేసులో ఏడుగురు సినిమా తారలకునోటీసులు పంపించారు. అల్లు శిరీష్, బొమన్ ఇరాని, వివేక్ ఒబెరాయ్, అనీల్ కపూర్, జాకీష్రాఫ్, పూజాహెగ్డే, షారుఖ్ ఖాన్ వంటి తారలకు  నోటీసులు జారీ చేశారు. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్యూనెట్ కేసు వ్యవహారాన్ని పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో క్యూనెట్ సంస్థలకు ప్రచారం చేసిన సెలబ్రిటీలపై దృష్టి సారించారు. క్యూనెట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన బాలీవుడ్ స్టార్లను పోలీసులు గుర్తించారు.

క్యూనెట్ కేసులో ఏడుగురు సినిమా తారలకు నోటీసులు పంపించారు. అల్లు శిరీష్, బొమన్ ఇరాని, వివేక్ ఒబెరాయ్, అనీల్ కపూర్, జాకీష్రాఫ్, పూజాహెగ్డే, షారుఖ్ ఖాన్ వంటి తారలకు నోటీసులు జారీ చేశారు.

తొలి నోటీసులకు బాలీవుడ్ తారలు స్పందించకపోవడంతో మరోసారి నోటీసులు పంపించారు. క్యూనెట్ కేసులో ఇప్పటివరకు 500 మందికి సైబరాబాద్ పోలీసులు నోటీసులు పంపించారు.

రెండు రోజుల క్రితం క్యూనెట్ బాధితుడు హైదరాబాద్ లో మాదాపూర్ లో ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో రూ.వేల కోట్లు దోచుకుందని క్యూనెట్ పై ఆరోపణ ఉంది.
 
 

PREV
click me!

Recommended Stories

Krishna Vamsi: రమ్యకృష్ణతో విడాకులు, కొడుకు చదువుపై క్లారిటీ ఇచ్చిన కృష్ణవంశీ
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ గతం తెలుసుకున్న బాలు, మీనా.. దెబ్బకు రోడ్డుమీద పడిన రోహిణీ